లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్  నుండి టైటిల్ సాంగ్  వీడియో విడుదల

యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో సంతోష్ శోభన్, ట్యాలెంటడ్ డైరెక్టర్  మేర్లపాక గాంధీల యూత్‌ఫుల్ లవ్ అండ్ క్రైమ్ ఎంటర్‌టైనర్ ‘లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్’ టీజర్, ఆసక్తికరమైన పోస్టర్‌లతో ట్రెమండస్ బజ్‌ని క్రియేట్ చేసింది. తాజాగా టైటిల్ ట్రాక్ వీడియోతో మ్యూజికల్ జర్నీని ప్రారంభించారు నిర్మాతలు.

లైక్ షేర్ & సబ్స్క్రయిబ్ టైటిల్ ట్రాక్ లో తన వ్లాగ్ కోసం కంటెంట్‌ను సిద్ధం చేయడంలో  ఫరియా అబ్దుల్లా బిజీగా వుండగా..సంతోష్ శోభన్‌ తన ప్రేమను తెలియజేస్తూ కనిపించడం ఆసక్తికరంగా వుంది. ఫరియా తన ఫాలోవర్స్ ని ఛానెల్‌ని లైక్ షేర్  & సబ్‌స్క్రైబ్ చేయమని కోరగా, సంతోష్ తన ప్రేమని అంగీకరించమని కోరడం క్యూరియాసిటీని పెంచింది.

ప్రవీణ్ లక్కరాజు ఫ్రెస్ అండ్ ఫ్లజంట్ ట్యూన్ ని కంపోజ్ చేయగా, స్వీకర్ అగస్తీ తన బ్రిలియంట్ వాయిస్ తో మెస్మరైజ్ చేశారు. ఈ పాటకు శ్రీమణి సాహిత్యం ఆకట్టుకుంది. ఈ పాటలో సంతోష్ శోభన్ తన డ్యాన్స్‌లతో ఆకట్టుకున్నాడు. తన డ్యాన్స్ మూవ్స్ చాలా గ్రేస్ ఫుల్ గా వున్నాయి.

వెంకట్ బోయనపల్లి  నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి ఆముక్త క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం నవంబర్ 4న థియేటర్లలో విడుదల కానుంది.

ఈ చిత్రానికి వసంత్ సినిమాటోగ్రాఫర్ గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు.

తారాగణం: సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా, నెల్లూరు సుదర్శన్

సాంకేతిక విభాగం :

రచయిత, దర్శకత్వం: మేర్లపాక గాంధీ

నిర్మాత: వెంకట్ బోయనపల్లి

బ్యానర్లు: ఆముక్త క్రియేషన్స్, నిహారిక ఎంటర్టైన్మెంట్

సంగీతం: ప్రవీణ్ లక్కరాజు

డీవోపీ: వసంత్

ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వెంకటరత్నం (వెంకట్)

పీఆర్వో: వంశీ-శేఖర్