అన్ని మంచి శకునములే… బాక్సాఫీస్ ఎలా ఉందంటే..

నందిని రెడ్డి దర్శకత్వంలో సంతోష్ శోభన్, మాళవిక నాయర్ జోడీగా తెరకెక్కిన అన్ని మంచి శకునములే సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకి వచ్చింది. స్వప్న సినిమా బ్యానర్ లో వరుస నాలుగు బ్లాక్ బస్టర్స్ తర్వాత వచ్చిన సినిమా కావడంతో దీనిపై మంచి పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. ఇక థియేటర్స్ లో రిలీజ్ అయిన తర్వాత ఈ మూవీ ఎవరేజ్ టాక్ సొంతం చేసుకోవడం విశేషం.

ఫ్యామిలీ ఆడియన్స్ కి కొంత వరకు కనెక్ట్ అయ్యింది. అయితే రొటీన్ స్టొరీ, ఇప్పటికే చూసినట్లు అనిపించే సీన్స్ తో సినిమాలో ఎలాంటి కొత్తదనం లేదనే మాట రెగ్యులర్ ఆడియన్స్ నుంచి వస్తోంది. మొదటి, రెండు రోజులు ఏ సినిమా అయిన ఫ్యామిలీ ఆడియన్స్ చూసేది తక్కువ కాబట్టి కొంత వరకు డివైడ్ టాక్ వచ్చిందని మేకర్స్ భావిస్తున్నారు. మెల్లగా రీచ్ అవుతుందని భావిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఫస్ట్ డే ఈ మూవీ 65 లక్షల షేర్ ని కలెక్ట్ చేసింది. అయితే వీకెండ్ రెండు రోజులు కలెక్షన్స్ కొంత డ్రాప్ అయ్యాయి. మొత్తం 61 లక్షల షేర్ ని మాత్రమే తరువాత కలెక్ట్ చేసింది. మూడు రోజుల్లో 1.26 కోట్ల షేర్ ని తెలుగు రాష్ట్రాలలో సాధించగా ఓవర్సీస్, కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాతో కలుపుకొని 1.91 కోట్ల షేర్ ని అన్ని మంచి శకునములే రాబట్టింది.

అయితే ఎలాగూ సెలవులు ఉన్నాయి కాబట్టి ఇకపై ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కి వచ్చి మూవీ చూసే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో మెల్లగా కలెక్షన్స్ పుంజుకొని బ్రేక్ ఎవెన్ కి రీచ్ అవుతుందని ఆశిస్తున్నారు. ఈ చిత్రం 5 కోట్ల బిజినెస్ రేంజ్ తో 5.50 కోట్ల బ్రేక్ ఎవెన్ లక్ష్యంగా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఇప్పటి వరకు వచ్చిన 1.91 కోట్ల షేర్ రాబట్టగా మరో 3.59 కోట్ల షేర్ ని లాంగ్ రన్ లో కలెక్ట్ చేయగలిగితే బ్రేక్ ఎవెన్ అందుకునే ఛాన్స్ ఉంది.

పెద్ద సినిమాలు ఏవీ లేవు కాబట్టి ఈ వారం రోజులు డీసెంట్ కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. అదే జరిగితే లాంగ్ రన్ లో మెల్లగా బ్రేక్ ఎవెన్ ని అన్ని మంచి శకునములే అందుకునే అవకాశం ఉంటుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.