క‌మ‌ర్షియ‌ల్ టైటిల్ పెట్టిన మారుతి.. గోపించంద్‌తో ఎలా తీస్తాడా అని చ‌ర్చ‌

క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల‌కు కామెడీని జోడించి ప్రేక్ష‌కుల‌కు మంచి వినోదాన్ని అందించే ద‌ర్శ‌కుడు మారుతి ఈ సారి మ్యాచో స్టార్ గోపిచంద్‌తో క‌లిసి మ‌రో ప్రయోగం చేసేందుకు సిద్ధ‌మయ్యాడు. గ‌త కొద్ది రోజులుగా ఈ చిత్రానికి సంబంధించి వెరైటీ అప్‌డేట్స్ ఇస్తూ వ‌స్తున్న మారుతి కొద్ది సేప‌టి క్రితం ఈ చిత్రానికి ఇంట్రెస్టింగ్ టైటిల్ ఫిక్స్ చేసిన‌ట్టు తెలిపారు. “పక్కా కమర్షియల్” అనే టైటిల్ తో ఈ చిత్రం రూపొంద‌నుందని, ఈ సినిమా ఫుల్ ఎంట‌ర్‌టైన్ అందించ‌డం ఖాయ‌మ‌ని తెలుస్తుంది. నేడు ఈ మూవీ పూజా కార్య‌క్ర‌మాల‌తో మొద‌లు కానుండ‌గా, మార్చ్ 5 నుంచి రెగ్యులర్ షూట్ జ‌రుపుకోనుంది. అక్టోబర్ 1న థియేటర్స్ లోకి విడుదల చెయ్యడానికి డేట్ లాక్ చేసేసారు.


గీతా ఆర్ట్స్ 2 మరియు యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్న మారుతి చిత్రంపై అభిమానుల‌లో చాలా ఆస‌క్తి నెల‌కొంది. ఇక ఇదిలా ఉంటే గోపీచంద్ ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో స్పోర్ట్స్ డ్రామాను చేస్తున్నాడు. క‌బ‌డ్డీ నేప‌థ్యంలో తెర‌కెకెక్కుతున్న ఈ సినిమాను శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై ప్రొడక్షన్‌‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నాడు. ఇందులో గోపీచంద్ ఫీమేల్‌ కబడ్డీ టీమ్‌కి కోచ్‌గా చేస్తుంటే.. తమన్నా తెలంగాణ ఫీమేల్‌ కబడ్డీ టీమ్‌ కోచ్‌ జ్వాలా రెడ్డిగా చేస్తోంది. హై బడ్జెట్‌, అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందుతున్న ఈ సినిమాలో హిప్పీబ్యూటీ దిగంగన సూర్యవంశీ నటిస్తోంది. మరో కీలక పాత్రలో భూమిక నటిస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

మరోవైపు తేజ ద‌ర్శ‌క‌త్వంలోను సినిమా చేసేందుకు స‌న్న‌ద్ధ‌మ‌య్యాడు తేజ‌. ఈ సినిమాకు అలిమేలు మంగ వెంక‌ట‌ర‌మ‌ణ అనే టైటిల్ ఫిక్స్ చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది. హీరోగా తేజ‌తో గోపిచంద్ చేస్తున్న తొలి మూవీ ఇదే కాగా, ఇందులో హీరో పాత్ర‌ను ఎలా ఎలివేట్ చేస్తాడా అని అంద‌రిలో ఆస‌క్తి నెల‌కొంది. కాగా మారుతి విష‌యానికి వ‌స్తే “భలే భలే మగాడివోయ్”, “ప్రతిరోజూ పండగే” చిత్రాల‌తో మంచి స‌క్సెస్ అందుకున్న ఈ ద‌ర్శ‌కుడు గోపిచంద్‌తో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడనే చ‌ర్చ ఇండ‌స్ట్రీలో మొద‌లైంది.