“ఆదిపురుష్” టీజర్ రిలీజ్ కి కూడా టైం ఫిక్స్.!

ఎట్టకేలకు రెండేళ్ల నిరీక్షణ తర్వాత ప్రభాస్ ‘ఆదిపురుష్’ నుండి ఒక అప్డేట్ వచ్చింది. చాలా కాలం గా అభిమానులు వేచి చూస్తున్న ప్రభాస్ ఫస్ట్ లుక్ వచ్చేసింది. ప్రభాస్ ఫస్ట్ లుక్  స్టన్నింగ్ పోస్టర్ తో ఈ మూవీ పై  అంచనాలు వేరే లెవెల్ కి తీసుకెళ్లారు మేకర్స్.

అలాగే టీజర్ రిలీజ్ టైం ని కూడా లాక్ చేసేసారు. మరి ఈ పోస్టర్ ని ఈరోజు ఉదయం 7 గంటల 11 నిమిషాలకి రిలీజ్ చేసిన మేకర్స్ మూవీ  టీజర్ ని అయితే ఈ అక్టోబర్ 2న సాయంత్రం 7 గంటల 11 నిమిషాలకి రిలీజ్ చేస్తున్నట్టు క్రేజీ అప్డేట్ అందించారు.

అయితే ప్రభాస్ లుక్ పైన కొంత చర్చ జరుగుతుంది. తెలుగు ప్రెకషకులకి రాముడు, కృష్ణుడు అంటే ఎన్టీఆర్. ఎన్టీఆర్ కంటే అందగాళ్ళైన కొందమంది ఆ రోల్ చేసినా కానీ ఎన్టీఆర్ ని మరిపించలేకపోయారు.

సినిమాల్లో, సీరియల్స్ లో కూడా రాముడు అంటే అందంగా, మీసాలు, గడ్డలు లేకుండా ఉండేలా చూపించారు. కానీ ఈ పోస్టర్ లో మాత్రం ప్రభాస్ మీసాలతో, కండలు తిరిగిన బాడీ తో ఉన్నాడు. యుద్ధభూమిలో ప్రభాస్ వీరవిహారం చేస్తున్నట్లు ఆ పోస్టర్ ఉంది.