శంషాబాద్ ఎయిర్‌పోర్టు ర‌న్ వేపై పులి … అప్రమత్తమైన సిబ్బంది

తెలంగాణ వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా పులి సంచారం కలకలం రేపింది. ఇప్పటికే పలు జిల్లాల్లో పులిని చూశామంటూ రైతలు, స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా శంషాబాద్ ఎయిర్‌పోర్టు పరిసరాల్లో పులి సంచారం ఉన్నట్లు గుర్తించారు. అర్ధరాత్రి రన్‌వే సమీపంలో 10 నిమిషాల పాటు పులి సంచరించింది.

 

chirutha puli - TV9 Telugu

10 నిమిషాల పాటు ఎయిర్‌పోర్ట్ రన్‌వేపై తిరగాడిన చిరుతు.. ఆ తర్వాత చిరుత రషీద్‌గూడ వైపు గోడ దూకి వెళ్లింది. ఎయిర్‌పోర్ట్ రన్‌వే పై చిరుత సంచారంతో అధికారులు అప్రమత్తమయ్యారు. చిరుత సంచారం నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. శంషాబాద్ పరిసర ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇక, చిరుత సంచారం వార్తలతో సమీప ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

ఇక, కొన్ని నెలల కిందట రాజేంద్ర నగర్ ప్రాంత వాసులను ఓ చిరుత దాదాపు ఆరు నెలల పాటు కలవరానికి గురిచేసిన సంగతి తెలిసిందే. రాత్రి వేళ్లల్లో ఆవులు, దూడలపై చిరుత దాడులు చేయడం స్థానికంగా కలవరం రేపింది. రోడ్డుపైకి రావడం.. ఆ తర్వాత క్షణాల్లోనే అటవీ ప్రాంతాల్లోకి పారిపోవడంతో దాన్ని కనిపెట్టం అధికారులు ఇబ్బందికరంగా మారింది. దీంతో స్థానికంగా ఉండే ప్రజలు తీవ్ర భయాందోళన చెందారు. మరోవైపు చిరుత ఆచూకీ కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. పలుచోట్ల ప్రత్యేక కెమెరాలను ఏర్పాటు చేశారు.