Anantapur: కూలి పనుల కోసం వెళ్లి తిరిగి ఇంటికి చేరుకున్న ఆ మహిళా కూలీలు వంతెన కూలి నీటిలో గల్లంతయిన ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో భాగంగా గల్లంతైన కూలీల కోసం పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపడుతున్నారు. అసలు ఏం జరిగింది అనే విషయానికి వస్తే…
అనంతపురం జిల్లాలోని డి.హీరేహాల్ మండలం నాగలాపురం, బొమ్మనహాల్ మండలం ఉద్దేహాళ్ గ్రామల మద్య ఉన్న హెచ్.ఎల్.సి. కాలు పై ఉన్న వంతెన కూలిపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది.ఉద్దేహాళ్‌కు చెందిన కూలీలు మల్లికేతి వద్ద టమోటా పొలంలో పనులు ముగించుకుని అనంతరం తిరిగి స్వగ్రామానికి బొలెరో వాహనంలో బయల్దేరి వెళ్లారు.ఇలా వీరి వాహనం వంతెన పైకి రాగానే వంతెన మధ్యలోకి కూలిపోవడంతో బొలెరో వాహనం నీటిలో మునిగింది.
ఈ క్రమంలోనే ఈ వాహనంలో ఉన్న వారు పెద్ద ఎత్తున అర్థ నాదాలు చేయడంతో స్థానికులు వెంటనే వారిని సురక్షితంగా బయటకు తీయగా ఈ ఘటనలో ముగ్గురు మహిళా కూలీల ఆచూకీ లభించలేదు. అయితే ఆ ముగ్గురు మహిళలు నీటిలో కొట్టుకుపోయినట్లు భావిస్తూ వారి కోసం పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఇప్పటికీ వారి ఆచూకీ తెలియకపోవడంతో వారు మృతి చెంది ఉంటారని కొందరు భావిస్తున్నారు.