Poojitha: తనతో పని చేయించుకొని చివరికి డబ్బులివ్వలేదని నటి పూజిత తెలిపారు. ఉదాహరణకు తనకు ఓ ప్రొడ్యూసర్ చాలా పేమెంట్ ఇవ్వాల్సి ఉండగా అతన్ని చాలా వరకు టాప్ మోస్ట్ బట్టల దుకాణం లేదా నగల కొట్టులో చూస్తానని ఆమె అన్నారు. కానీ బయటికి రాగానే మాత్రం తనతో నా పరిస్థితి అస్సలు బాగోలేదమ్మా.. ఏం చేయాలి? అని అంటారని ఆమె చెప్పుకొచ్చారు. కానీ అతను బయటికొచ్చేది మాత్రం ఖరీదైన బట్టలు లేదా నగల దుకాణం నుంచి అని, వాళ్ల భార్యకున్నన్ని నగలు అలివేలు మంగమ్మ తర్వాత అన్ని నగలు వేసుకునేది ఆమేనేమో అని ఆమె చెప్పారు. కానీ ఆయన మాత్రం కష్టంలో ఉన్నానని చెప్తారని పూజిత అన్నారు. అప్పుడు తాను కష్టంలో ఉన్నపుడు మీరు మాత్రం ఏం చేస్తారు. నేను వెయిట్ చేస్తాలేండీ అని అంటానని ఆమె వివరించారు.
అంటే మన రుణంలో ఆయన ఉన్నారు. అంతేగాని ఆయన రుణంలో మనం లేమని ఆమె చెప్పారు. ఆయన అంత లెవల్లో ఉండి కూడా అంతగా దిగజారి చెప్పుకుంటున్నాడన్న పూజిత, ఆయనకు విలువలు పట్టవని ఆమె అన్నారు. తనకు వాల్యూస్ ఉన్నాయి కాబట్టి తాను అలా చేయలేనని ఆమె స్పష్టం చేశారు. దేవుడు అన్నీ చూస్తూనే ఉంటాడని, ఎక్కడో ఒక దగ్గర పెడతాడని ఆమె చెప్పారు. కాబట్టి తనను చూసి వాళ్లు తప్పించుకోవడమో, లేదంటే అబద్దం చెప్పడమో జరుగుతుందని ఆమె అన్నారు.
తాను ఎప్పుడూ ఒక్కటే అనుకుంటానని, అదేంటంటే వాళ్లు తనకెప్పుడూ ఎదురు పడకూడదని అని ఆమె అన్నారు. కానీ తాను ఎప్పుడు జ్యువెల్లరీ షాప్‌కి వెళ్లినా, లేదంటే బ్యాంక్‌కు వెళ్లినా వాళ్లే ఎదురు పడతారని ఆమె చెప్పారు. బ్యాంక్‌లో డబ్బులు లేకపోతే మనం బ్యాంక్‌కు ఎందుకు వెళ్తాం? జువెల్లరీ షాప్‌లో ఏమైనా కొంటే డబ్బులు లేకుండా వాళ్లు ఊరికే ఇవ్వరు కదా ? అని ఆమె ప్రశ్నించారు. అంటే వాళ్ల దగ్గర డబ్బులున్నట్టే కదా అని ఆమె అన్నారు. అలా చాలా మంది తనకు డబ్బులివ్వకుండా తిప్పుకున్నారని ఆమె అన్నారు. ఇది వరకు తాము అంతా మనమే అనుకొని డబ్బుల గురించి చివర మాట్లాడుకునే వాళ్లమని, కానీ ఇప్పటి తరం వాళ్లు మాత్రం అలా లేరని ముందే డబ్బులు మాట్లాడుకొని నటిస్తున్నారని ఆమె వివరించారు.