పవన్, సాయి తేజ్ మల్టీస్టారర్ లో ఈ యంగ్ హాట్ హీరోయిన్ ఫిక్స్..??

ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే దీనితో తన సినిమాలకు మళ్లీ దూరంగా ఉంటుండగా రీసెంట్ గా పవన్ ఒక భారీ టూర్ ని అయితే ప్లాన్ చేసుకున్నాడు. ఈ టూర్ కి స్టార్ట్ అయ్యే లోపు భారీ పాన్ ఇండియా సినిమా హరిహర వీరమల్లు దర్శకుడు క్రిష్ తో సాధ్యమైనంత పూర్తి చేయడం అలాగే మరో రీమేక్ ని కంప్లీట్ చేయడం జరుగుతుంది అని భోగట్టా.

అయితే ఈ సినిమాల్లో తమిళ హిట్ వినోదయం సైతం ని సముద్రకని దర్శకత్వంలో తెరకెక్కించనుండగా ఇప్పుడు ఈ సినిమాపై క్రేజీ టాక్ ఒకటి వినిపిస్తోంది. దీని ప్రకారం అయితే సాయి తేజ్ కి జంటగా ఓ యంగ్ అండ్ హాట్ హీరోయిన్ ని దింపుతున్నారని తెలుస్తోంది. ఆమె మరెవరో కాదు ప్రెజెంట్ సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ తో నటిస్తున్న హీరోయిన్ కేతిక శర్మ. ఈమెకి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది.

మరి ఇప్పుడు ఈమెని సాయి తేజ్ కోసం ఈ సినిమాలో హీరోయిన్ గా ఫిక్స్ చేసినట్లు టాక్. ఇంకా దీనిపై అయితే అధికారిక క్లారిటీ రావాల్సి వుంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. మరి ఈ సినిమాని ఓటీటీ కి ఇస్తారో థియేటర్స్ లోనే రిలీజ్ చేస్తారో అనేది తెలియాల్సి ఉంది.