ప్రభాస్ పెద్దలని కలిసిన యంగ్ హీరోయిన్..మేటర్ ఏంటో?

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా ఇప్పుడు పలు భారీ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఇంకో పక్క ప్రభాస్ సినిమాలతో బిజీగా ఉన్నా అభిమానుల్లో మాత్రం ఇంకా తన పెళ్ళెప్పుడు అనే ప్రశ్న ఇంకా ప్రశ్నార్ధకంగా మారింది. అయితే ఇప్పుడు టాలీవుడ్ యంగ్ హీరోయిన్ నందిత శ్వేత ప్రభాస్ పెద్దలు కృష్ణం రాజు మరియు వారి భార్యని ఆమె కలిసి బ్లెస్సింగ్స్ తీసుకున్నట్టు చెప్పింది.

అయితే ఇంత సడెన్ గా వీరికి కనెక్షన్ ఎలా కుదిరిందో అనేది చాలా ఆసక్తిగా మారిపోయింది. మరి ఏదన్నా సినిమా పని మీద ఆమె వారి ఏరియా కి వెళ్లి కలిసిందా లేక వేరే కారణం ఏదన్నా ఉందా అనేది తెలియాల్సి ఉంది. నందిత శ్వేత టాలీవుడ్ లోకి ఫస్ట్ సినిమా “ఎక్కడికి పోతావు చిన్నవాడా”తో ఎంట్రీ ఇచ్చింది. ఆల్రెడీ అప్పుడే వీరి పెళ్లి కనెక్షన్ తో స్టోరీలు చాలా మంది అల్లేయడం స్టార్ట్ చేశారు. మరి ఫైనల్ గా ఏం జరుగుతుందో చూడాలి.