మొత్తానికి మళ్ళీ బిజీగా మారుతున్న ఈ యంగ్ హీరోయిన్.!

Urvashivo Rakshashivo

టాలీవుడ్ లో హీరోయిన్స్ కి అంత ప్రాధాన్యత ఇవ్వరు అనే మాట చాలా వరకు ఆల్రెడీ ఇక్కడ వర్క్ చేసి స్టార్డం అందుకున్న హీరోయిన్స్ చెప్పిన మాట. అయితే హీరో పక్కన హీరోయిన్ కి అంత గట్టి రోల్స్ ఉండకపోవచ్చు కానీ వారిపై పలు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు అందులోని సాలిడ్ కంటెంట్ తో ఉన్నవి మన నుంచే ఉన్నాయని అనేది కూడా వాస్తవం.

అలాగే టాలీవుడ్ లో అడుగు పెట్టి హిట్స్ అందుకొని మళ్ళీ ఫేడ్ అవుట్ అయ్యాక మళ్ళీ హిట్ ట్రాక్ లో పడడం అనేది చాలా అరుదైన విషయం. మరి దీనిని అయితే ఓ యంగ్ హీరోయిన్ సొంతం చేసుకుంది. ఆమె మరెవరో కూడా కాదు లేటెస్ట్ గా ఉర్వశివో రాక్షసివో తో హిట్ ట్రాక్ లో పడిన అను ఇమ్మానుయేల్.

తెలుగులో చాలా హిట్స్ లో నటించింది. ఈమె ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో నా పేరు సూర్య ప్లాప్ తర్వాత మళ్ళీ ఒక్క తెలుగు లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా పెద్దగా కనిపించలేదు. కానీ ఇప్పుడు మొత్తానికి అయితే ఈ యంగ్ హీరోయిన్ కి మంచి ఆఫర్స్ వస్తున్నాయట.

మళ్ళీ ఈమె బిజీగా మారినట్టు సినీ వర్గాలు చెబుతున్నాయి. అల్లు శిరీష్ సినిమా తర్వాత రీసెంట్ గానే కార్తీ సినిమాలో అవకాశం దక్కించుకుంది. దీనితో పాటుగా పలు తెలుగు సినిమాలు కూడా ఓకే చేయగా మరింతమంది నిర్మాతలు ఆమెని అప్రోచ్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. దీనితో అయితే కెరీర్ లో మళ్ళీ ఈమె పుంజుకుంది.