పుష్ప సినిమాతో నేషనల్ క్రష్‌గా మారిపోయి సూపర్ ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది కన్నడ సోయగం రష్మిక మందన్నా . చేతినిండా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్న ఈ భామ నటిస్తోన్న చిత్రాల్లో ఒకటి ది గర్ల్‌ఫ్రెండ్. రష్మిక లీడ్ రోల్‌లో వస్తోన్న ఈ చిత్రానికి టాలీవుడ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు. చాలా కాలానికి ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ వార్త ఒకటి నెట్టింట రౌండప్ చేస్తుంది. ఈ మూవీ టీజర్‌కు స్టార్ యాక్టర్ విజయ్ దేవరకొండ వాయిస్ ఓవర్ ఇచ్చినట్టు ఫిలింనగర్ సర్కిల్ సమాచారం.
సిల్వర్ స్క్రీన్‌పై సూపర్ కాంబోగా నిలిచిన రష్మిక మందన్నా-విజయ్ దేవరకొండ ప్రేమలో మునిగి తేలుతున్నట్టు ఇప్పటికే ఇండస్ట్రీ సర్కిల్‌లో న్య్సూ హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. గర్ల్‌ఫ్రెండ్‌కు సపోర్ట్ ఇస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఈ మూవీలో చికాగో బ్యూటీ అనూ ఇమ్మాన్యుయేల్ కీ రోల్‌లో కనిపించనుంది.
ఈ మూవీని అల్లు అరవింద్ సమర్పణలో మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై విద్య కొప్పినీడి, ధీరజ్ మొగిలినేని తెరకెక్కిస్తున్నారు. కన్నడ యాక్టర్ దీక్షిత్ శెట్టి కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీకి పాపులర్ మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హేశమ్ అబ్దుల్ వహబ్ సంగీతం అందిస్తున్నాడు.