Bheemla Nayak: “RRR” ఉన్నా కూడా “భీమ్లా నాయక్” కాన్ఫిడెన్స్ అందుకే..!

టాలీవుడ్ నుంచి రాబోతున్న పలు ఇంట్రెస్టింగ్ మల్టీ స్టారర్ చిత్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటిలు హీరోలుగా నటిస్తున్న భారీ యాక్షన్ మాస్ ఫిల్మ్ “భీమ్లా నాయక్” కూడా ఒకటి. దర్శకుడు సాగర్ చంద్ర తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఇప్పుడు ఆల్ మోస్ట్ ముగింపు దశకి కూడా వచ్చేసింది.

అయితే ఈ సినిమాని మాత్రం పక్కాగా ఎక్కడా తగ్గకుండా తప్పకుండా హిట్ సినిమాగా ప్లాన్ చేస్తున్నట్టు మళ్ళీ ప్రూవ్ అయ్యింది. లేటెస్ట్ గా వచ్చిన సాంగ్ అడవి తల్లి కూడా సినిమాపై మరింత ఆసక్తి రేపుతోంది. మొదటి మూడు పాటలు కూడా దేనికదే కొత్తది కాగా ఇది ఇంకొకటి.

#AdaviThalliMaata | Bheemla Nayak Songs | Pawan Kalyan | Rana | Trivikram | SaagarKChandra | ThamanS

ఇది విన్నాక చూసాక మాత్రం సంక్రాంతి బరిలో భారీ ట్రిపుల్ ఆర్(RRR) లాంటి సినిమా ఉన్నా కూడా ఎందుకు పోటీకి వస్తున్నారో అర్ధం అవుతుంది. చాలా ఆసక్తికర విజువల్స్ ని ముఖ్యంగా మన తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా డిజైన్ చేసిన విజువల్స్ సాలిడ్ గా ఉన్నాయి. ఇవి అన్నీ చూస్తుంటే మొదటి నుంచీ మేకర్స్ ఎందుకు అంత కాన్ఫిడెంట్ గా ఉన్నారో క్లారిటీ ఇప్పుడిప్పుడే వస్తుంది.