ప్రభాస్ సినిమా నుంచి తప్పుకున్న మారుతీ?? ఇందులో ఎంతవరకు నిజం అంటే!

ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరియు అలాగే తనతో వర్కే చేస్తున్న యంగ్ దర్శకులు సహా కొత్త దర్శకులు పరిస్థితి ఏమి బాగాలేదని చెప్పాలి. దీనితో ప్రభాస్ ఈ దర్శకులతో కాకుండా స్టార్ దర్శకులతో వర్క్ చేసి హిట్ అందుకోవాలని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే ప్రభాస్ లైనప్ లో సాహూ దర్శకుడు సుజీత్, రాధే శ్యామ్ దర్శకుడు రాధా కృష్ణ తర్వాత మరో దర్శకుడ్ మారుతీ తో సినిమా అనేసరికి అభిమానులు బెంబేలెత్తిపోతున్నారు. మొన్నటివరకు అంటే ఓకే కానీ రీసెంట్ గా మారుతీ తీసిన “పక్కా కమర్షియల్” సినిమాతో అయితే అంతా ఫిక్స్ అయ్యిపోయారు.

ప్రభాస్ మారుతీ కాంబోలో తమకి సినిమా వద్దని. దీనితో ప్రభాస్ సినిమా నుంచి మారుతీ అందాకా తప్పుకొని యంగ్ మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తో మళ్ళీ ఓ సినిమా చేస్తున్నట్టుగా పలు ఊహాగానాలు బయటకి వచ్చి వైరల్ అవుతున్నాయి. అయితే మరి నిజంగా తాను తప్పుకున్నాడా లేదా అనే దానిపై ఇప్పుడు సమాచారం తెలుస్తుంది.

మారుతి సాయి తేజ్ కాంబోలో సినిమా లేదని నెక్స్ట్ ప్రభాస్ తోనే సినిమా ఉందని తెలుస్తుంది. కాకపోతే మారుతిని స్క్రిప్ట్ పర్ఫెక్ట్ గా సెట్ చేసి తీసుకురమ్మన్నాడని సినీ వర్గాల నుంచి సమాచారం. దీనితో అందరికి ఒక క్లారిటీ వచ్చినట్టే అని చెప్పాలి.