Radhe Shyam : ఇన్సైడ్ టాక్ : ప్రభాస్ ‘రాధే శ్యామ్’ నుంచి నెక్స్ట్ వచ్చే అప్డేట్ ఇదే రాస్కోండి.!

Radhe Shyam : ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ తో టాలీవుడ్ లో హంగామా ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది.. ఇక దీనితో మిగతా రానున్న భారీ సినిమాలకు పెద్ద బూస్టప్ నే దక్కింది అని చెప్పాలి. మరి ఈ సినిమా తర్వాత లైన్ లో ఉన్న మరో బిగ్గెస్ట్ చిత్రం “రాధే శ్యామ్”.

ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమా భారతదేశ వ్యాప్తంగా కూడా ఎనలేని అంచనాలు నెలకొల్పుకుంది. మరి ఈ సినిమా మార్చ్ 11న రిలీజ్ కాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ మేకర్స్ ఎందుకో మళ్ళీ మౌనంగా ఉన్నారు. దీనితో మరింత ఆసక్తికర వాతావరణం నెలకొనగా నెక్స్ట్ వచ్చే అప్డేట్ ఏమిటా అని అంతా ఎదురు చూస్తున్నారు.

మరి ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో దీనిపై ఇన్సైడ్ టాక్ వినిపిస్తుంది. నెక్స్ట్ రాధే శ్యామ్ నుంచి వచ్చే బిగ్ అప్డేట్ ఈ సినిమాలోని మరో సాంగ్ కోసం అట. ఈ సినిమాలోని మరో బ్యూటిఫుల్ సాంగ్ ని చిత్ర బృందం త్వరలో రిలీజ్ చేస్తున్నట్టుగా ఇపుడు సమాచారం తెలుస్తుంది.

అలాగే దీనిపైనే అప్డేట్ కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు మరో టాక్. ఇప్పటికే ఈ సినిమాలోని పాటలు అన్నీ మంచి హిట్ అయ్యాయి. మరి వేచి చూడాలి నెక్స్ట్ వచ్చే సాంగ్ ఎలా ఉంటుందో. ఈ సినిమాలో సౌత్ ఆల్బమ్ ని జస్టిన్ ప్రభాకరన్ కంపోజ్ చెయ్యగా హిందీ ఆల్బమ్ ను మిథున్ మరియు మనన్ భరద్వాజ్ లు కంపోజ్ చేశారు.