ఇండస్ట్రీ టాక్ : ప్రభాస్ వరల్డ్ ప్రాజెక్ట్ లో ఊహించని వ్యక్తి ఉన్నాడా.?

ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా నటిస్తున్న పలు భారీ చిత్రాల్లో దర్శకుడు నాగ్ అశ్విన్ తో చేస్తున్న అవైటెడ్ చిత్రం ప్రాజెక్ట్ కే కూడా ఒకటి. అయితే ఈ సినిమాని ఏకంగా వరల్డ్ లెవెల్లో మేకర్స్ తెరకెక్కిస్తుండగా ఈ చిత్రంలో అనేక మంది బిగ్గెస్ట్ స్టార్స్ కూడా ప్రభాస్ తో స్క్రీన్ ని పంచుకుంటుండగా నెక్స్ట్ ఇంకో క్రేజీ గాసిప్ ఈ సినిమాపై ఇప్పుడు బయటకొచ్చి వైరల్ అవుతుంది.

అలాగే ఇది ఓ ఊహించని టాక్ బయటకి వచ్చింది. ఈ చిత్రంలో ప్రముఖ సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఓ పాత్రలో నటిస్తున్న టాక్ బయటకి వచ్చింది. రామ్ గోపాల్ వర్మ నటుడుగా అందులోని ఓ వరల్డ్ లెవెల్ ప్రాజెక్ట్ లో నటించనుండడం అనేది కాస్త డౌట్ గానే ఉంది కానీ ప్రస్తుతం టాక్ అయితే సినీ వర్గాల్లో ఇంట్రెస్టింగ్ గా మారింది.

మరి నిజంగానే వర్మ ఉన్నాడా లేదా అనేది వేచి చూడాల్సిందే. ఇంకా ఈ భారీ సినిమాలో అయితే దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుండగా అమితాబ్ కూడా నటిస్తున్నారు. అలాగే మినిమమ్ బడ్జెట్ గా అయితే నిర్మాత అశ్వనీదత్ 500 కోట్ల బడ్జెట్ తో ఈ స్కై ఫై ఫాంటసీ చిత్రాన్ని తెరక్కిస్తున్నారు.