Big Boss Non Stop: బాస్ టైటిల్ విన్నర్ రేస్ లో ఉన్నది వీరిద్దరే..? పోటిలో గెలిచేది ఎవరు..?

Big Boss Non Stop: పోటీలో ప్రసారమవుతున్న బిగ్ బాస్ నాన్స్టాప్ సీజన్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం ఏడు మంది కంటెస్టెంట్ లు ఫైనల్స్ వరకు చేరుకున్నారు. బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం శివ, అనిల్, అఖిల్, అరియానా, మిత్రా, బిందు, బాబా భాస్కర్ ఉన్నారు. వీరందరూ టైటిల్ కోసం ఒకరితో మరొకరు గట్టి పోటీ ఇస్తున్నారు. కానీ బిందు, అఖిల్ ఈ రేస్ లో ముందంజలో ఉన్నారు. వీరిద్దరు గత కొన్ని వారాలుగా ఒకరికితో ఒకరు పోటీ పడుతున్నారు. ఇక ఓటింగ్ విషయంలో కూడా వీరిద్దరికీ మద్య పోటీ రసవత్తరంగా సాగుతోంది.

ఈ సీజన్ ఫినాలేకి దగ్గర పడుతుండటంతో అన్ అఫీషియల్ పోలింగ్ సైట్స్ ఆధారంగా విన్నర్ ని డిసైడ్ చేస్తున్నారు. కానీ ఈ పోలింగ్స్ సైట్స్ లో ఓటింగ్ గురించి సరైన లెక్కలు ఉండవు. గంటలకు వచ్చిన ఓట్ల గురించి బిగ్బాస్ యాజమాన్యం వారు అసలు బయటపెట్టారు. యూట్యూబ్ పోలింగ్స్ ,అన్ అఫీషియల్ పోలింగ్ సైట్స్ ఆధారంగా అఖిల్, బిందు మొదటి వరుసలో ఉన్నారు. యూట్యూబ్ పోలింగ్ సైట్స్ ఆధారంగా 50% అధిక ఓటింగ్ తో బిందూ మాధవి మొదటివరుసలో ఉండగా..30% ఓటింగ్ తో అఖిల్ రెండవ స్థానంలో ఉన్నాడు.

యూట్యూబ్ పోలింగ్ ఆధారంగా టైటిల్ దక్కించుకునే అవకాశం బిందు మాధవికి ఎక్కువగా ఉంది. ఒకవేళ ఈ సీజన్లో బిందు టైటిల్ దక్కించుకుంటే తెలుగులో ప్రసారమైన అన్ని బిగ్బాస్ సీజన్ లో మొట్టమొదటి సారిగా ఒక మహిళ టైటిల్ విన్నర్ గా నిలుస్తుంది.ఇక
అన్ అఫీషియల్ పోలింగ్ సైట్స్ ఆధారంగా అఖిల్ 45శాతం అధిక ఓటింగ్ తో అఖిల్ ముందు వరసలో ఉన్నాడు. ఇక బిందు 38 శాతం ఓటింగ్ తో రెండవ స్థానంలో ఉంది. కానీ మిగిలిన కంటెస్టెంట్ లు తర్వతి స్థానాల్లో ఉన్నారు. ఈ పోలింగ్ సైట్స్ ఆధారంగా బిందు, అఖిల్ ఇద్దరిలో ఎవరో ఒకరు టైటిల్ దక్కించుకునే అవకాశం ఉంది