‘సాహో’ బ్యూటీ ప్రబాస్‌తో ఈ సారి ‘స్పెషల్’‌గా.!

భారీ అంచనాల నడుమ విడుదలైన ‘సాహో’ మూవీ అంచనాలను అందుకోలేకపోయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ టాలీవుడ్‌లో అడుగు పెట్టింది. సినిమా సక్సెస్ అయ్యి ఉంటే, మరో ఛాన్స్ తీసుకోవాలనుకుంది కానీ, సీన్ రివర్స్ అయ్యింది. దాంతో టాలీవుడ్‌లో మరో ఛాన్స్ దక్కించుకోలేకపోయిందీ హాట్ బ్యూటీ.

అయితే, తాజాగా మరోసారి టాలీవుడ్‌లో అడుగు పెట్టబోతోందట శ్రద్ధాకపూర్. అయితే, ఈ సారి హీరోయిన్‌గా కాదు. ప్రబాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘సలార్’ ‌లో ఓ స్పెషల్ సాంగ్ ఉండబోతోందట. ఆ సాంగ్ కోసం శ్రద్ధా కపూర్ పేరు టాలీవుడ్ తెరపై మళ్లీ చర్చకొచ్చింది. అఫీషియల్ ప్రకటన రాలేదు. కానీ, ప్రబాస్ కోసం శ్రద్ధా ఈ ఆఫర్‌ను కాదనకపోవచ్చని అంటున్నారు. త్వరలోనే ఈ స్సెషల్ సాంగ్ విషయమై క్లారిటీ ఇవ్వనున్నారట.

ఇకపోతే, ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. పవర్ ఫుల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమాకి సంబంధించి కొన్ని పాటలు మినహా షూటింగ్ పార్ట్ చాలా వరకూ పూర్తయ్యింది. వీలైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేయనున్నారనీ తెలుస్తోంది.