ఇప్పుడు పాన్ ఇండియా సినిమా దగ్గర మంచి బ్రాండ్ ఉన్న స్టార్ హీరోల్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా ఒకడు. అయితే ప్రభాస్ ఇప్పుడు పలు సినిమాలు ఒకదాన్ని మించి ఒకటి ఓకే చేస్తుండగా వాటిలో ఏకంగా ప్రపంచ స్థాయి సినిమాలు కూడా ఉన్నాయి. అయితే ఇలా ఓ రేంజ్ లో సినిమాలు చేస్తున్న ప్రభాస్ మధ్యలో ఓ చిన్న సినిమా దర్శకుడు మారుతితో ఓకే చేసాడు.
మరి ఇక్కడే అసలు సమశ్య వచ్చిందట. ఈ ఒక్క ప్రాజెక్ట్ విషయంలో ప్రభాస్ తీసుకున్న ఈ నిర్ణయం మాత్రం ఓ నిర్మాతకి నచ్చలేదని టాక్ సినీ వర్గాల్లో వైరల్ గా మారింది. మరి ఆ నిర్మాత మరెవరో ప్రభాస్ సినిమా ని మినిమమ్ బడ్జెట్ గా 500 కోట్లు పెట్టిన నిర్మాత అశ్వనీదత్ అట. ప్రభాస్ ఇప్పుడు భారీ సినిమాలు చేస్తున్న నేపథ్యంలో అలాంటి చిన్న సినిమాలు చేయడం మార్కెట్ కి దెబ్బ తీస్తుంది అని భయపడుతున్నారట.
అందుకే మారుతితో సినిమా చెయ్యొద్దని ప్రభాస్ కి అడ్డు చెప్పే ప్రయత్నం చేస్తున్నారని సినీ వర్గాల్లో గాసిప్స్ వినిపిస్తున్నాయి. అయితే మారుతీ తన సినిమా విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు కానీ ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా వద్దనే కోరుకుంటున్నారు. మరి ప్రభాస్ అయితే ఎలాంటి డెసిషన్ తీసుకుంటాడో చూడాలి.