నెంబర్ అడిగితే ఆ నెంబర్ ఇచ్చేసిన స్టార్ హీరోయిన్.!

నిన్న ఒక్కసారిగా సోషల్ మీడియా అంతా స్తంభించింది. రాత్రి సమయంలో పేస్ బుక్ అలాగే వాట్సాప్ ఇంస్టాగ్రమ్ లు చాలా సేపు ఆగిపోవడంతో సెలెబ్రెటీలు అంతా ట్విట్టర్ లోకే వచ్చి రచ్చ చేశారు. మరి ఈ క్రమంలో స్టార్ హీరోయిన్ శృతి హాసన్ కూడా ట్విట్టర్ లోకి వచ్చేసింది. వచ్చి తన ఫాలోవర్స్ తో కాసేపు మాట్లాడే ప్రయత్నం చేసింది. తనని ఏమన్నా అడగండి చెప్తాను అని ట్వీట్ చెయ్యగా.

దానికి ఓ అత్యుత్సాహపు నెటిజన్ శృతి హాసన్ ని ఏకంగా తన మొబైల్ నెంబర్ అడిగేశాడు. దీనికి బదులుగా శృతి హాసన్ కూడా నెంబర్ ఇచ్చేసింది. కానీ ఇక్కడే ట్విస్ట్ ఏమిటంటే ఆమె తన నెంబర్ కాకుండా పోలీస్ ఎమెర్జెన్సీ డైల్ 100 నెంబర్ ని ఇచ్చి షాకిచ్చింది. దీనితో అతడికి మొఖం తెల్లబోయినట్టు అయ్యింది. దీనితో ఈ ట్వీట్ కాస్తాయా వైరల్ అవుతుంది.