గత కొన్నాళ్ల నుంచి మన ఇండియన్ సినిమా దగ్గర కూడా మంచి సీక్వెల్స్ కూడా రావడం స్టార్ట్ అయ్యాయి. అయితే గతంలో కూడా వచ్చాయి. కానీ అవి అనుకున్న రేంజ్ లో అయితే రాణించలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా డెఫినెట్ గా లేదు. ఈసారి ఏ భాషలో అయినా కూడా ఒకదాన్ని మించి ఒక సీక్వెల్ ని మేకర్స్ సాలిడ్ కంటెంట్ తో కొడుతున్నారు.
మరి అలా మన సౌత్ నుంచే పలు సీక్వెల్స్ రెడీగా ఉండగా వాటిలో ఒక్క హీరో నుంచే ఏకంగా మూడు సీక్వెల్ చిత్రాలు రెడీగా ఉండడం విశేషం. మరి ఆ స్టార్ హీరో అయితే కార్తీ కాగా తాను రీసెంట్ గా నటించిన భారీ హిట్ “సర్దార్” తో మూడు సీక్వెల్స్ తన నుంచి రానున్న రోజుల్లో రానున్నాయి.
ఇప్పుడు సర్దార్ పి ఎస్ మిత్రన్ దర్శకత్వంలో వచ్చి తెలుగు మరియు తమిళ్ లో భారీ హిట్ అయ్యింది. వసూళ్లు కూడా అదిరే రేంజ్ లో వస్తుండగా ట్రేడ్ వర్గాలు కూడా ఆనందంగా ఉన్నాయి. ఇక దీనిని పక్కన పెడితే తన కెరీర్ మరో భారీ తెలుగు అండ్ తమిళ్ హిట్ ఖైదీ కి కూడా రెండో సినిమా కన్ఫర్మ్ అయ్యింది.
దానిని వచ్చే ఏడాది చివరలో స్టార్ట్ చేయనున్నారు. ఇక ఫైనల్ గా అయితే తమిళ నాట ఈ ఏడాది భారీ వసూళ్లు కొల్లగొట్టిన చిత్రం “పొన్నియిన్ సెల్వన్” కూడా ఒకటి. దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ఈ చిత్రంలో కూడా కార్తీ అతి ముఖ్య పాత్రలో నటించాడు.
మొదటి సినిమాలో అయితే విక్రమ్ కన్నా కార్తీ నే కీలక పాత్రలో కనిపించగా నెక్స్ట్ ఈ సినిమా సీక్వెల్ తో కూడా కార్తీ రెడీగా ఉన్నాడు. దీనితో సౌత్ నుంచే కాకుండా ఇండియన్ సినిమా దగ్గరే ఒకదాన్ని మించి ఒకటి భారీ సీక్వెల్ తో తాను రెడీగా ఉన్నాడు.