ఇప్పుడు సినీ వర్గాల్లో ఎక్కడ విన్నా కూడా అంతా “కాంతారా” కోసమే మాట్లాడుకుంటున్నారు. సినిమాలో కంటెంట్ పరంగా అయితేమీ వసూళ్ల పరంగా అయితేనేమి ఈ సినిమా ఒక సంచలనంగా ఇప్పుడు మారింది. అవ్వడానికి కన్నడ భాష చిత్రమే అయినా కూడా తెలుగులో హిందీలో యూఎస్ మార్కెట్ లో వసూళ్లతో ఇప్పటికీ దుమ్ము లేపేస్తుంది.
దీనితో ఈ సినిమా ఓ పెను సంచలనంగా మారగా ఇప్పుడు ఓ విషాదర నిజం అయితే బయటకి వచ్చింది. ఈ చిత్రంలో హీరోగా కనిపించిన రిషబ్ శెట్టి నే దర్శకత్వం వహించాడని తెలిసిందే. కానీ రిషబ్ అయితే మొదట తాను హీరోగా చెయ్యాలని కథ సిద్ధం చేసుకోలేదట.
తాను హీరోగా కన్నడ స్టార్ అండ్ లెజెండరీ హీరో దివంగత పునీత్ రాజ్ కుమార్ ని హీరోగా అనుకున్నాడట. ఆయనకి కథ కూడా చెప్పాడట కానీ ఈ చిత్రంలో ఎందుకో పునీత్ నటించడం జరగలేదు. ఈ రకంగా అయితే కాంతారా లాంటి సినిమాని ఆ లెజెండ్ మిస్ చేసుకోవడం జరిగింది.
ఒకవేళ కానీ ఈ చిత్రాన్నే చేసి రిలీజ్ చేసి ఉంటే అప్పు కెరీర్ లో ఈ చిత్రం చెరగని హిస్టారికల్ హిట్ గా నిలిచిపోయి ఉండేది అని చెప్పి తీరాలి..