మహేష్, త్రివిక్రమ్ మూవీ టైటిల్ ఇదే…

అతడు’, ‘ఖలేజా’ తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కామిబినషన్ లో మూడో సినిమా రెడీ అవుతుంది. పన్నెండు సంవత్సరాల తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్ లో మూవీ రావడం తో ఈ మూవీ కి చాలా క్రేజ్ వచ్చింది. పైగా ‘అల వైకుంఠపురంలో’ లాంటి సూపర్ హిట్ తర్వాత త్రివిక్రమ్ నుండి వస్తున్నా సినిమా ఇది.

సూపర్ స్టార్  మహేష్ బాబు కి ఇది 28వ సినిమా. ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. ఈ సినిమా ఇటీవల షూటింగ్ ను స్టార్ట్ చేశారు. అన్నపూర్ణ స్టూడియోలో మూడు రోజులు షూట్ చేశారు. రెండో షెడ్యూల్ దసరా తర్వాత మొదలు కానుంది.

అది అలా ఉంటే ఈ సినిమాకు మొన్నటి వరకు పార్ధు అనే టైటిల్ పరిశీలనలో ఉందని టాక్ రాగా.. ఇప్పుడు తాజాగా మరో టైటిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాకు అయోధ్యలో అర్జునుడు అనే టైటిల్ ను దాదాపుగా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కొన్నాళ్ళనుండి త్రివిక్రమ్ కి ‘అ’ సెంటిమెంట్ బాగా ఎక్కువైంది. అందుకే తన మూవీస్ కి ‘అ’ తో టైటిల్ వచ్చేలా చూస్తున్నాడు. ‘అత్తారింటికి దారేది’, ‘అ ఆ’, ‘అజ్ఞాతవాసి’, ‘అరవింద సమేత’, ‘అల వైకుంఠపురంలో’…ఇలా తన అన్ని సినిమాలకు ‘అ’ తో టైల్ ఉండేలా జాగ్రత్తపడుతున్నాడు త్రివిక్రమ్. ఈ విషయంలో త్వరలో అధికారిక ప్రకటన రానున్న‌ట్టు స‌మాచారం.