“రాధే శ్యామ్” నుంచి రేపు వచ్చే అప్డేట్ ఇదే!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరో డస్కీ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ భారీ సినిమా “రాధే శ్యామ్”. షూటింగ్ అంతా కంప్లీట్ చేసుకొని రిలీజ్ కి రెడీ అవుతున్న క్రమంలో చిత్ర యూనిట్ ఇప్పుడు ప్రమోషన్స్ లో పడ్డారు. ఇక ఇదిలా ఉండగా ఈ నెల 23 న డార్లింగ్ హీరో ప్రభాస్ బర్త్ డే కానుకగా ఓ స్పెషల్ అప్డేట్ ని మేకర్స్ వదులుతున్నారని టాక్ ఉండగా దానికన్నా ముందే రేపు అక్టోబర్ 13న పూజా హెగ్డే బర్త్ డే కానుకగా మరో అప్డేట్ ని ఇస్తున్నారట.

తాజా సమాచారం ప్రకారం అయితే పూజా పై ఖచ్చితంగా ఓ ప్రత్యేకమైన పోస్టర్ ని రిలీజ్ చేస్తారట. అంతే కాకుండా ఉంటే ఓ చిన్న వీడియో లాంటిది కూడా ఏమన్నా రావొచ్చని తెలుస్తుంది. కానీ వీటిలో పోస్టర్ అయితే కన్ఫర్మ్ అట. ఇక ఈ పోస్టర్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ భారీ సినిమాని రాధా కృష్ణ దర్శకత్వం వహించగా యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.