Home Andhra Pradesh ఇది తుగ్లక్ పాలనే..! భూసర్వే అందుకే చేస్తున్నాడు.. బాబు వైరల్ వ్యాఖ్యలు

ఇది తుగ్లక్ పాలనే..! భూసర్వే అందుకే చేస్తున్నాడు.. బాబు వైరల్ వ్యాఖ్యలు

 ఇది రాక్షస రాజ్యమా ఆటవిక రాజ్యమా కిరాతక రాజ్యమా వర్ణించలేని స్థితి అంటూ టీడీపీ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. బుధవారం మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గం టిడిపి నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ భాగంగా బాబు ఈ వ్యాఖ్యలు చేశాడు.

Cbn And Cm Jagan

టిడిపి పాలనలో దాచేపల్లిలో ఒక ఆడబిడ్డపై అత్యాచారం జరిగితే 22సెర్చిపార్టీలను నియమించి వెంటాడటంతో నిందితుడు ఉక్కిరిబిక్కిరై ఉరిపోసుకునే పరిస్థితి..అలాంటిది ఇప్పుడు ప్రతిరోజూ ప్రతిపూటా మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయి, నేరగాళ్లంతా చెలరేగిపోతున్నా చర్యలు లేకపోవడం శోచనీయం. చేయని నేరానికి బిసి నేత కొల్లు రవీంద్రను 53రోజులు జైలుకు పంపారు, బైటకొచ్చాక కూడా వదలకుండా వేధిస్తున్నారు, ఉపాధి కోల్పోయిన తాపీ కార్మికుడు ఎవరో మంత్రిపై దాడికి పాల్పడితే, కొల్లు రవీంద్రకు నోటీసులు ఇవ్వడం వైసిపి వేధింపులకు పరాకాష్ట.

ఇంట్లో ఉంటే ఒక కేసు, బైటకొస్తే ఇంకో కేసు..తప్పుడు కేసుల జమానాగా జగన్ పాలన. అక్రమ నిర్బంధాల జమానాగా మారింది జగన్ పాలన. యధేచ్చగా దోపిడి చేయడం, ప్రత్యర్ధులపై బురద జల్లడం, ప్రజలను మభ్యపెట్టడంలో దిట్ట జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో ఉచితంగా దొరికే ఇసుకను సీమ జిల్లాల నుంచి బెంగళూరుకు, చెన్నైకి, రాజధాని ప్రాంతం నుంచి హైదరాబాద్ కు, ఉత్తరాంధ్ర నుంచి ఒడిశాకు యధేచ్చగా ఇసుక అక్రమ రవాణాతో వైసిపి నాయకులు అడ్డంగా దోచేస్తున్నారు.

తాగే నీటిపై పన్ను, మరుగుదొడ్డిపై పన్ను, కాలిబాటపై పన్ను, వీథి దీపంపై పన్ను, తాతలు ఇచ్చిన ఆస్తిపై ప్రతి ఏటా పన్ను పెంపు.. నిల్చుంటే పన్ను, కూర్చుంటే పన్ను..సుంకాల సిఎంగా జగన్ రెడ్డి మారాడు. టిడిపి కృషివల్లే కృష్ణా జిల్లా దేశంలో హర్యానా తర్వాత అత్యధిక తలసరి ఆదాయంగల జిల్లాగా మారింది. రూ11,924కోట్లతో 2దశల్లో బందరు పోర్టు నిర్మాణానికి టిడిపి ప్రభుత్వం శ్రీకారం చుడితే, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక తన బినామీల పరం చేసేందుకే మచిలీపట్నం పోర్టు కాంట్రాక్ట్ రద్దు చేశాడు. విశాఖ నుంచి నెల్లూరుదాకా కోస్తాతీరం కబళించడమే జగన్ ధ్యేయం.

వైసిపి నాయకుల కన్నుపడ్డ భూమి గల్లంతే.. ఒకవైపు వైసిపి నాయకులు భూబకాసురుల్లా మారి భూములను మింగేస్తూ, ఇంకోవైపు భూరక్ష-భూహక్కు అనడం దయ్యాలు వేదాలు వల్లించడమే…
వ్యవసాయ భూముల్లో మట్టిలో కప్పెట్టే సరిహద్దు రాళ్లకు గ్రానైట్ రాళ్లా..? వాటిపై జగన్ రెడ్డి ఫొటోలా..? తుగ్లక్ అనేది ఇందుకే.. వైసిపి నాయకుల బారినుంచి తమ భూములను కాపాడుకోడానికి, పంటలను కాపాడుకోడానికి రైతులు ఆత్మహత్యాయత్నాలకు పాల్పడటం జగన్మోహన్ రెడ్డి దుర్మార్గ పాలనకు అద్దం పడుతోంది… తన పంట కాపాడుకోడానికి పోతుమర్రులో సలీమ్ కత్తితో పొడుచుకోవడం తాజా ఉదాహరణ అంటూ మండి పడ్డారు చంద్రబాబు

- Advertisement -

Related Posts

Akanksha Sharma

Akanksha Sharma, Akanksha Sharma phots, Akanksha Sharma stills, Akanksha Sharma gallery, Akanksha Sharma pics, Akanksha Sharma phots, model, actress ...

Poonam Bajwa

Poonam Bajwa, Poonam Bajwa pics,Poonam Bajwa stills, Poonam Bajwa phots, Poonam Bajwa latest stills, model, actress ...

Amyaela

Amyaela, Amyaela pics, Amyaela stills, Amyaela phots, Amyaela model, Amyaela latest pics ...

Latest News