Uday Kiran: చిరంజీవి పెద్ద కూతురితో ఉదయ్ కిరణ్ ఎంగేజ్‌మెంట్ అయ్యి పెళ్లి ఆగిపోవడానికి కారణం ఇదే… డైరెక్టర్ కామెంట్స్ వైరల్!

Uday Kiran: ఉదయ్ కిరణ్ నాలుగో సినిమా అప్పుడనుకుంటా చిరంజీవి గారి పెద్దమ్మాయితో పెళ్లి ఫిక్స్ అయిందని మోహన్ అన్నారు. చిరంజీవి గారు కూడా ఉదయ్‌ అంటే చాలా ఇష్టంతో, అతన్ని తన అల్లుడిగా చేసుకోవడానిక తన ఇంట్లో మనిషిగా ఫీలయ్యారని ఆయన చెప్పారు. అంతే కాకుండా చిరంజీవి గారు ఎప్పుడూ స్వచ్ఛమైన ఒక స్పటికం లాంటి వారని ఆయన అన్నారు. చాలా పారదర్శకంగా ఉంటారని, టాలెంట్‌ ఎక్కడున్నా సరే ఎంకరేజ్‌ చేస్తారని కూడా ఆయన చెప్పారు. నిజంగా ఆయన పేరుకు తగ్గట్టే మెగాస్టార్ అని, ఆయన గురించి మాట్లాడడానికి తన అనుభవం గానీ, వయసు గానీ సరిపోదని ఆయన తెలిపారు.

అలా ఎంతో ఇష్టపడి, ఉదయ్‌ని ఎంకరేజ్ చేసి తన ఇంట్లో మనిషిని చేసుకోవాలనుకున్నారని మోహన్ చెప్పారు. అది ఎందుకు చెడిపోయిందనే విషయం తనక్కూడా పూర్తిగా తెలియదని, తాను ఆ సమయంలో సింగపూర్‌లో ఉన్నానని ఆయన అన్నారు. తాను విన్న దాని ప్రకారం, ఉదయ్ తనంతట తానే వద్దనుకున్నాడు అని ఆయన చెప్పారు. మొదట్లో ఒప్పుకున్నాడు కాబట్టే ఎంగేజ్‌మెంట్ జరిగిందని, కానీ ఆ తర్వాత ఏమైందనే విషయం మాత్రం తనకు తెలియదని ఆయన అన్నారు. అది తన వ్యక్తిగత విషయమన్న మోహన్, ఎవరికీ ఏదీ ఇష్టం లేకుండా అలా బలవంతంగా చేయించలేం కదా అని ఆయన అన్నారు. ఇక అప్పుడు ఎలాంటి పరిస్థితులు అతన్ని అలా ప్రభావితం చేశాయనేది కూడా కచ్చితంగా చెప్పలేమని ఆయన స్పష్టం చేశారు.

కానీ తాను మనసంతా నువ్వే 175 డేస్ ఈవెంట్‌కి వెళ్లినయినపుడు మాత్రం తాను చూసిన దాని ప్రకారం చిరంజీవి గారు ఉదయ్‌ని చాలా ఎంకరేజ్ చేశారని ఆయన అన్నారు. అంటే ఒకప్పుడు అల్లు రామలింగయ్య గారు ఎలాగైతే చిరంజీవి గారిని తీసుకొచ్చి ఎంకరేజ్ చేశారో, అలాగే చిరంజీవి గారు కూడా ఉదయ్ కిరణ‌్‌ని ఎంకరేజ్ చేశారని, ఆ ఇష్టంతోనే తన అల్లుడిగా చేసుకోవాలనుకున్నారని ఆయన తెలిపారు. కానీ ఎందుకు అది ఆగిపోయిందో తనకు స్పష్టమైన కారణాలు తెలియవని ఆయన వివరణ ఇచ్చారు.