వెకేషన్ అనుకొని పొరబడ్డారు.. సుమ న్యూయార్క్ టూర్ వెనుక ఆసలు కారణం ఇదే..!

బుల్లితెర మహారాణిగా చలామణి అవుతున్న యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె ఎక్కడ ఉంటే ఆ పరిసర ప్రాంతాలలో చాలా సందడిగా ఉంటుంది. ఈమె మాటలతో ప్రేక్షకులను మాయ చేసి తన అభిమానులుగా మార్చుకుంది. టీవీ షోలు, ఇంటర్వ్యూలు, సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లతో నిత్యం బిజీగా ఉండే సుమ గత కొన్ని రోజులుగా న్యూయార్క్ లో సందడి చేస్తోంది. కంటిన్యూగా షూటింగ్, షోస్ తో అలసిపోయిన సుమ విరామం కోసం న్యూయార్క్ వెళ్లిందని ఇప్పటివరకూ అందరు అనుకున్నారు. కానీ సుమ న్యూయార్క్ టూర్ వెనక వేరే కారణం ఉంది .

మన తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా విదేశాలలో ఉన్న తెలుగు ప్రజలు కూడ ఈమెకి అభిమానులు. సాధారణంగా విదేశాలలో ఉండే తెలుగూ ప్రేక్షకుల సంఘాల గురించి మనకు తెలిసిన విషయమే. ఇక్కడ ఉన్న సెలబ్రిటీలను అక్కడికి పిలిపించి షోస్ చేయిస్తుంటారు. ఇలా ప్రముఖ సింగర్స్ కూడా విదేశాలలో సింగింగ్ షోస్ చేస్తుంటారు. అలాగే ఇప్పుడు కూడా సుమ, రవి వంటి వారు న్యూయార్క్ కి వెళ్లినట్టు కనిపిస్తోంది. అక్కడ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ టాటా ఆమెను సత్కరించారు.

ఈ సందర్భంగా సుమ మాట్లాడుతూ.. తనకు సన్మానం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. అమెరికన్ తెలుగు అసోసియేషన్ వారికి నా కృతజ్ఞతలు అంటూ చెప్పుకొచ్చింది.అయితే సెలబ్రిటీలు అక్కడికి వెళ్లి ఉండటానికి అయ్యే కర్చు మొత్తం తెలుగు అసోసియేషన్ వారే భరిస్తారు. అందువల్ల గత కొన్ని రోజులుగా సుమ న్యూయార్క్ లో షాపింగ్, రెస్టారెంట్లు అంటూ నానా హంగామా చేస్తోంది. ఇటీవల ఒక రెస్టారెంట్ కి వెళ్ళిన సుమ అక్కడ రోబో సర్వర్ ని చూసి సంబరపడిపోయింది. ఇక సుమ ఎప్పుడు రిటర్న్ అవుతుందో చూడాలి మరి.