Samantha: రంగస్థలంలో సినిమాలో సమంత చేయి పట్టుకుంటే సమంత అలా మాట్లాడారు.. కమెడియన్!

Samantha: ఖైదీ నెం.150 సినిమాలో తాను చేసిన పోలీసు పాత్రను చూసి సుకుమార్ తనకు రంగస్థలంలో అవకాశం ఇచ్చారని ఆర్టిస్ట్ నాగ మహేశ్ అన్నారు. చిరంజీవి గారి పక్కన చేసిన అతను అసలు తెలుగు వాడేనా, ఎక్కడి వాడు అని ఆరా తీసి, వివరాలు కనుక్కొని తనను కలవమని సుకుమార్ తనకు కబురు పెట్టాడని ఆయన చెప్పారు. సుకుమార్ గారిని కలవగానే బాగా రిసీవ్ చేసుకున్నారని, చక్కగా మాట్లాడారని ఆయన చెప్పుకొచ్చారు. అయితే తాను మాత్రం అప్పటికీ ఒక మామూలు ఆర్టిస్టేనని, కానీ తనకు ఖైదీ నెం.150 ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారో ఈ సినిమాకు కూడా అంతే ఇవ్వమని కోరినట్టు ఆయన తెలిపారు. అంత పెద్ద డైరెక్టర్ అయిన సుకుమార్ గారినే అడిగేంత ధైర్యం ఎలా వచ్చింది అనే విషయానికొస్తే ఆయన మాట్లాడిన తీరు, ఆ కలివిడితనం ఆయన్ను అలా అడిగేలా చేసేంత చొరవ ఏర్పడిందని నాగ మహేశ్ అన్నారు.

ఇకపోతే తనను రంగస్థలం సినిమాలో ఖైదీ నెం.150లో చేసిన లాంటి పోలీసు పాత్రనే ఇద్దామనుకున్నారు. కానీ తనతో మాట్లాడిన తర్వాత ఆయన నిర్ణయం మార్చుకున్నారని, అందుకే పోలీసు పాత్రకే పరిమితం చేద్దామనుకున్న తనను, సమంత తండ్రి పాత్రకు అవకాశం అందించారని ఆ తర్వాత తనకు తెలిసినట్టు నాగ మహేశ్ స్పష్టం చేశారు.

తాను అప్పటివరకూ చేసిన పాత్రలన్నీ చిన్న పాత్రలే. కానీ రంగస్థలం సినిమా విషయానికొస్తే ఒక ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేసే అవకాశం వచ్చిందని ఆయన చెప్పారు. దానికి ముందు తనకు సుకుమార్ ఎలాంటి హోంవర్క్ ఇవ్వలేదని, షాట్‌కి రమ్మనడం, చేయమనటం, చేయడం.. ఇలా అప్పటికప్పుడు అయిపోయేవని ఆయన అన్నారు. ఇక షూట్ విషయానికొస్తే ఎంత సక్కగున్నావే పాట చేస్తున్నారు. అప్పుడు సుకుమార్ తనను పిలిచారని ఇతను హీరోయిన్ ఫాథర్ అని అక్కడి వారికి చెప్పారని ఆయన అన్నారు. ఆ తర్వాత తాను అక్కడి నుంచి వెళ్లిపోతుంటే మళ్లీ పిలిచి అందరితో ఫ్రీగా మాట్లాడండి. పరిచయం చేసుకోండి అని ఆయన చాలా బాగా చెప్పారని నాగ మహేశ్ అన్నారు. అయితే ఒక సీన్లో సమంత చేయి పట్టుకొని లాగాల్సి ఉంటుంది. అలా చేయి పట్టుకొని లాగినపుడు మీరేమైనా ఫీల్ అయ్యారా అని ఆమెను అడిగితే అయ్యో అలా ఏం లేదండీ.. పట్టుకోండి పర్లేదు అని అన్నట్టు ఆయన చెప్పారు. అయినా ఈ ఫ్రొఫెషనల్‌లో ఉన్నవాళ్లు అలా ఏం ఫీల్ కారని, అర్థం చేసుకుంటారని ఆయన స్పష్టం చేశారు.