Naga Chaitanya: నా కెరీర్లో ఇదే ఫస్ట్ సినిమా.. మొదట్లో భయపడ్డాను..ఆ అనుభవం ఉపయోగపడింది: నాగ చైతన్య

Naga Chaitanya: అక్కినేని యువ హీరో నాగచైతన్య నటించిన బంగార్రాజు చిత్రం ఈ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా జనవరి 14వ తేదీ విడుదల కావడంతో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగచైతన్య ఈ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా నాగచైతన్య మాట్లాడుతూ మనం సినిమా తన తండ్రి నాగార్జునతో కలిసి నటించిన విషయం మనకు తెలిసిందే అయితే ఈ సినిమాలో నాగార్జున గారితో కలిసి నటించాలంటే చాలా భయపడ్డాను కానీ ఆ తరువాత అలవాటు అయిపోయింది అని నాగచైతన్య తెలియజేశారు.

మనం సినిమా నాన్నతో కలిసి నటించడం వల్ల ఆ అనుభవం బంగార్రాజుకి ఎంతో ఉపయోగపడిందని ఈ సినిమాలో నాగార్జున గారితో కలిసి నటించడానికి ఏమాత్రం భయపడలేదని నాగచైతన్య తెలిపారు. ఈ సినిమాలో నేను చిన్న బంగార్రాజు పాత్రలో నటిస్తానని, ఇందులో తన పాత్ర ఎంతో అల్లరిగా చిలిపిగా ఉంటుందని తెలిపారు. ఈ చిన్న బంగార్రాజును అదుపులో పెట్టడం కోసం తన తాత పెద్ద బంగార్రాజు వస్తారని నాగచైతన్య తెలిపారు. ఇక తన కెరియర్లో సంక్రాంతి పండుగకు వస్తున్న మొట్ట మొదటి చిత్రం బంగార్రాజు.

ఈ పండుగ అనుగుణంగా ఈ చిత్రాన్ని నిర్మించామని ఖచ్చితంగా ఈ సినిమా ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకుంటుందని నాగ చైతన్య ఆశాభావం వ్యక్తం చేశారు.ఇక ఇందులో కృతి శెట్టి నాగలక్ష్మి అనే పాత్రలు ఎంతో అద్భుతంగా నటించిందని ఆమె సర్పంచిగా సినిమాలో ఉన్నట్లు నాగచైతన్య తెలిపారు. ఈ సినిమా కోసం కర్రసాము కూడా నేర్చుకున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. సోగ్గాడే చిన్ని నాయన తర్వాత ఎలాంటి హిట్ లేని నాగార్జున ఈ చిత్రంతో హిట్ అందుకుంటారు లేదా అనేది మరొక రోజులో తెలియనుంది.