“పుష్ప” కోసం రష్మికా ఈ రేంజ్ లో ప్రిపేర్ అయ్యిందట.!

ఇక ఈ డిసెంబర్ నెలలో రిలీజ్ కి రెడీగా ఉన్న భారీ చిత్రాల్లో “పుష్ప” కూడా ఒకటి. నిన్న బాలయ్య నటించిన అఖండ సినిమా భారీ హిట్ కావడం మంచి ఓపెనింగ్స్ అందుకోవడంతో పుష్ప కి మరిన్ని అసలు చిగురించాయి. ఈ సినిమాకి కూడా అంతకు మించే స్థాయి ఓపెనింగ్స్ ఉంటాయని అంతా ఆశిస్తున్నారు.
అయితే మరి ఈ సినిమాలో ఒక్కొక్కరికీ ఒక్కో యూనిక్ రోల్ ని దర్శకుడు సుకుమార్ డిజైన్ చేసినట్టు ఆల్రెడీ అర్ధం అయ్యింది. అలానే హీరోయిన్ రష్మికా మందన్నా కి కూడా శ్రీవల్లి అనే డీ గ్లామరైజ్ పాత్రని సృష్టించి ఆమె లుక్ నే మార్చేశారు. అయితే అసలు ఈ రోల్ కి ప్రిపేర్ అయ్యిందో లేటెస్ట్ ఇంటర్వ్యూ లో ఆమె తెలిపింది.
తన పాత్ర కోసం చాలానే రీసెర్చ్ చేసిందట. కొన్ని రూరల్ ఏరియాస్ కి వెళ్లి అక్కడి అమ్మాయిలతో గడిపి వారి అలవాట్లు మాటలు యాస అన్నీ తెలుసుకుందట. అంతే కాకుండా సినిమా షూటింగ్ టైం లో ఆ అడవి ప్రాంత గ్రామ వాసులతో కూడా మాట్లాడి వారి జీవన శైలి, నడవడిక, ఆహారపు అలవాట్లు ఎలా ఉంటాయో అనే అంశాలు అన్నీ తెలుసుకొని ఈ సినిమా కోసం రష్మికా ప్రిపేర్ అయ్యిందట.