ప్రభాస్ సరసన ఈ హాట్ బ్యూటీ ఫిక్సేనట.!

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పాన్ ఇండియా లెవెల్లో చేస్తున్న భారీ చిత్రాల్లో ఇంకా షూటింగ్ కావాల్సిన చిత్రాలు కొన్ని ఉన్నాయి. అయితే ఈ చిత్రాల్లో దర్శకుడు మారుతీ తో చేయనున్న క్రేజీ జానర్ ప్రాజెక్ట్ కూడా ఒకటి ఉంది. అయితే ఈ సినిమాపై గత కొన్నాళ్ల నుంచి అనేక గాసిప్స్ వినిపిస్తూ ఉండగా..

వాటిలో ప్రభాస్ మారుతి సినిమాపై కూడా చాలానే బయటకి వచ్చాయి. అయితే ఈ సినిమాపై ఇప్పుడు కొన్ని వార్తలు అయితే హీరోయిన్ ని కన్ఫర్మ్ చేస్తున్నాయి. అయితే ఈ వార్తలతో అయితే ఈ సినిమాలో తమిళ హాట్ బ్యూటీ మాళవిక మోహనన్ నే నటించనున్నట్టు తెలుస్తుంది.

ఈ సినిమాలో ప్రభాస్ సరసన మరికొందరు హీరోయిన్ లు కూడా వచ్చింది. అయితే ఇపుడు వీరిలో మెయిన్ హీరోయిన్ గా కనిపించేది మాళవిక మోహన్ నే దీనిపై అధికారిక అప్డేట్ కూడా వచ్చేస్తుంది అని ఇండస్ట్రీ వర్గాల నుంచి సమాచారం వినిపిస్తుంది.

ఇక ఇదిలా ఉండగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి థమన్ సంగీతం అందిస్తుండగా ఇది కూడా పాన్ ఇండియా లెవెల్లోనే తెరకెక్కనుంది కాకపోతే ఒక క్విక్ ప్రాజెక్ట్ గా ప్లాన్ చేస్తున్నట్టు టాక్. అలాగే ఈ సినిమాని కూడా యూవీ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహించనున్నారు.