Prabhas : ఇన్సైడ్ టాక్ : ప్రభాస్ కోసం ఈ హాట్ హీరోయిన్ ని దింపుతున్నారా?

Prabhas : పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా ఇప్పుడు పలు భారీ సినిమాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఒకదాన్ని మించి మరొకటి భారీ సినిమాలు చేస్తూ వస్తున్న ప్రభాస్ తన కెరీర్ లో రెండు బ్యాక్ టు బ్యాక్ ప్లాప్స్ ని తన కెరీర్ లో ఇప్పుడు “రాధే శ్యామ్” తో దురదృష్టవశాత్తు అందుకున్నాడు.
కానీ ఇప్పటికే అనౌన్స్ అయ్యిన కొన్ని భారీ సినిమాలపై అంచనాలు మాత్రం అంతే స్థాయిలో ఉన్నాయి. కానీ ఇంకా అనౌన్స్ కావాల్సిన సినిమాపై మాత్రం ఇండస్ట్రీ వర్గాల్లో మంచి టాక్ వినిపిస్తుంది.  మారుతీ తో అనుకున్న భారీ సినిమా “రాజా డీలక్స్”.
అయితే ఈ సినిమాలో ప్రభాస్ కోసం ఏకంగా ముగ్గురు హీరోయిన్స్ ని దింపుతున్నారని గాసిప్స్ వినిపించాయి. కానీ ఇప్పుడు మాత్రం వేరే వెర్షన్ ఈ హీరోయిన్స్ పై వినిపిస్తుంది. ప్రస్తుతానికి కోలీవుడ్ కి చెందిన ఓ హాట్ బ్యూటీ పేరు పరిశీలనలో ఉందట.
ఆమె మరెవరో కాదు స్టార్ హీరో విజయ్ చేసిన మాస్టర్ లో కనిపించిన బ్యూటీ మాళవిక మోహనన్ ఆ సినిమాలో తన గ్లామర్ డోస్ తక్కువే కానీ ఈమె మాత్రం కాస్త బోల్డ్ హీరోయిన్ అనే చెప్పాలి. మరి ఈమెని హీరోయిన్ గా అనుకుంటున్నట్టు టాక్. దీనిపై అధికారిక క్లారిటీ ఏమన్నా వస్తుందో లేదో చూడాలి.