KGF Chapter 2 : బిగ్ బజ్ : “కేజీఎఫ్ 2” లో హాట్ ఐటమ్ సాంగ్ కి ఈ సెన్సేషనల్ బ్యూటీ.!

KGF Chapter 2 : పాన్ ఇండియన్ సినిమా దగ్గర ఈ ఏడాది విడుదల అయ్యే భారీ సినిమాల్లో ఓ రేంజ్ అంచనాలు నెలకొల్పుకున్న చిత్రాల్లో మన దగ్గర నుంచి ట్రిపుల్ ఆర్(RRR) ఒకటి కాగా కన్నడ ఇండస్ట్రీ నుంచి ది మోస్ట్ అవైటెడ్ గా నిలిచి ఉన్న భారీ ఏక్షన్ చిత్రం “కేజీఎఫ్ చాప్టర్ 2” కూడా ఒకటి. కన్నడ స్టార్ హీరో రాకింగ్ స్టార్ యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా మొదటి పార్ట్ ఇచ్చిన హై దెబ్బకి రెండో సినిమా పై ఇండియన్ సినిమా దగ్గర బాహుబలి తర్వాత ఏ సినిమాపై కూడా నెలకొనని అంచనాలు ఈ చిత్రంపై నెలకొన్నాయి.

మరి అందుకు తగ్గట్టు గానే దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్లో నే తెరకెక్కించాడు. ఇలా ప్రతి అంశం లోని జాగ్రత్త తీసుకుంటూ ఐటమ్ సాంగ్ ని కూడా గ్రాండ్ గానే ప్లాన్ చేసినట్లుగా ఇప్పుడు తెలుస్తోంది. ఈ షూట్ ని హైదరాబాద్ లోనే భారీ సెట్ వేసి చిత్రీకరణ చేయగా ఇప్పుడు అసలు ఈ సాంగ్ లో ఎవరు కనిపిస్తారు అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. మరి ఈ హాట్ ఐటమ్ సాంగ్ కోసం గాను బాలీవుడ్ యంగ్ అండ్ సెన్సేషనల్ హాట్ బ్యూటీ అయినటువంటి అనన్య పాండే ని దింపారట.

మరి ఈ సాంగ్ ని కూడా ఆమె అంతే హాట్ గా చేసినట్లు ఇప్పుడు తెలుస్తుంది. మరి అలాగే ఈ యంగ్ బ్యూటీ మన టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ మరియు మాస్ దర్శకుడు పూరి జగన్నాథ్ ల కాంబోలో తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా “లైగర్” లో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.