RRR Movie Booked : షాకింగ్ : “RRR” షో కోసం ఏకంగా థియేటర్ నే బుక్ చేసేసిన ఆ హీరో ఫ్యాన్స్.!

RRR Movie Booked

RRR Movie Booked :  ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో ఆడియెన్స్ కొన్ని సినిమాలు ఏ రేంజ్ లో ఎదురు చూస్తున్నారో అందరికీ తెలిసిందే. వాటిలో ముఖ్యంగా అయితే దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మల్టీ స్టారర్ చిత్రం ట్రిపుల్ ఆర్(RRR) కూడా ఒకటి.

చెప్పలేని రేంజ్ అంచనాలు నెలకొల్పుకున్న ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంటి ఇద్దరు మాస్ హీరోలు కనిపిస్తుండడంతో అభిమానులు సహా సినిమా లవర్స్ అత్యంత ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.

అయితే మన దగ్గర హీరోలు ఎంత మాసివ్ గా ఎదురు చూస్తున్నారో ఓవర్సీస్ లో అభిమానులు కూడా అంతకు మించిన అంచనాలతో ఎదురు చూస్తున్నారు. మరి అక్కడ ఓ హీరో ఫ్యాన్స్ అయితే ఏకంగా ఒక థియేటర్ నే ప్రీమియర్ షో కి బుక్ చేసేసారట.

ఆ హీరో మరెవరో కాదు యంగ్ టైగర్ ఎన్టీఆర్ నే అట. తన అభిమానులు ఈ సినిమా కోసం ఫ్లోరిడా లోని ఒక థియేటర్ ని మార్చ్ 24 సాయంత్రం 6 గంటల షో కి కంప్లీట్ థియేటర్ నే బుక్ చేసేసారట. దీనితో ఈ వార్త సినీ వర్గాల్లో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది.

అలాగే ఇంకో పక్క ఈ సినిమాతో పాటుగా మరికొంతమంది అయితే 70 టికెట్లను బుక్ చేసి మరో షాక్ కూడా ఇచ్చారు. ఇలా మొత్తంగా అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా కసిగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారని చెప్పాలి.