Pawan : పవన్ తో యాక్ట్ కోసం ఇంట్రెస్ట్ చూపిస్తున్న బాలీవుడ్ హాట్ బ్యూటీ.!

With Pawan

With Pawan : గాడ్ ఆఫ్ మాసెస్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ బడ్జెట్ చిత్రం “హరిహర వీరమల్లు“. ఈ సినిమా తోనే పవన్ మొదటి సారిగా పాన్ ఇండియా లెవెల్లో అడుగు పెట్టబోతున్నాడు. అయితే గతంలోనే తన సర్దార్ తో హిందీలోకి వెళ్లి దెబ్బ తిన్నాడు కానీ ఈ సినిమా మాత్రం మంచి అంచనాలు నెలకొల్పుకుంది.

పైగా మంచి ప్లానింగ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనేకమంది బాలీవుడ్ స్టార్స్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ లో బాలీవుడ్ నుంచే కొందరు స్టార్ నటీమణులు నటిస్తున్నారు. అయితే వారిలో బాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ హాట్ బ్యూటీ పవన్ తో నటించేందుకు చాలా ఇంట్రెస్ట్ కనబరుస్తుందట.

ఆమెనే బాలీవుడ్ సెన్సేషన్ నోరా ఫతేహి. హిందీ మీడియా వర్గాలు చెబుతున్న దాని ప్రకారం అయితే ఈమె ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ లో పాల్గొననుండగా ఆ షెడ్యూల్ లో పవన్ తో నటించేందుకు ఆమె చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుందని వారు అంటున్నారు.

మరి ఆమెకి ఈ సినిమాలో ఎలాంటి పాత్రని దర్శకుడు క్రిష్ డిజైన్ చేసాడో చూడాలి. ఇక అలాగే ఈ సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్ ఆల్రెడీ ఫిక్స్ అయ్యిన సంగతి తెలిసిందే. అలాగే ఈ సినిమాని మెగా సూర్య ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహిస్తుండగా ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.