Hari Hara Veera Mallu : పవన్ భారీ బడ్జెట్ సినిమాపై అప్డేట్ ఇచ్చిన దర్శకుడు..!

Hari Hara Veera Mallu : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ సినిమాగా తెరకెక్కుతున్న చిత్రాల్లో టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న సినిమా “హరిహర వీరమల్లు” కూడా ఒకటి. ఇది వరకు పవన్ కళ్యాణ్ ఎప్పుడూ టచ్ చెయ్యని పీరియాడిక్ సబ్జెక్ట్ కాబట్టి పవన్ అభిమానులు చాలా ప్రత్యేకంగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.

అయితే ఆల్రెడీ 50 శాతంకి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ భారీ సినిమా పై లేటెస్ట్ అప్డేట్ ని అందించారు. తాజాగా తాను మరియు పవన్ కళ్యాణ్ లు కలిసి స్క్రిప్ట్ చర్చలు జరిపామని, అలాగే వచ్చే కొత్త ఏడాది తో ఒక ఎగ్జైటింగ్ షెడ్యూల్ ని స్టార్ట్ చెయ్యబోతున్నామని తెలిపారు.

ఇక ఈ భారీ సినిమా లో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించగా బాలీవుడ్ మరో స్టార్ నటి నర్గీస్ ఫక్రి కొత్తగా చేరింది. ఇక అలాగే ఈ చిత్రంకి కీరవాణి సంగీతం అందివ్వగా మెగా సూర్య ప్రొడక్షన్ వారు 150 కోట్లకి పైగా బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.