వైరల్ అవుతున్న బాలయ్య మాస్ సాంగ్..కనిపించే బ్యూటీ ఈమెనట.!

 balayya 107 : ప్రెజెంట్ నందమూరి నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రముఖ దర్శకుడు అయినటువంటి గోపీచంద్ మలినేని తో ఒక భారీ మాస్ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో కనిపిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతుంది.
మొన్న మే 16 నుంచి కొత్త షెడ్యూల్ ఒక అదిరే సాంగ్ తో స్టార్ట్ చేశారు. అయితే దీనిపై నిన్ననే మేకర్స్ ఒక ఇంట్రెస్టింగ్ సెల్ఫీ ని రిలీజ్ చెయ్యగా ఇప్పుడు అది వైరల్ అవుతుంది. అయితే ఈ పాటని రాసిన రచయిత రామ జోగయ్య శాస్త్రి అయితే ఈ సాంగ్ మామూలుగా ఉండదు అని ఓ రేంజ్ లో అంచనాలు పెంచగా..
ఈ సాంగ్ పై మరింత సమాచారం తెలుస్తుంది. నిజానికి ఇది ఒక మాస్ సాంగ్ మాత్రమే కాదు ఈ సినిమాలో ఐటెం సాంగ్ అట. అలాగే ఈ సాంగ్ కి గాను ఇండో ఆస్ట్రేలియన్ బ్యూటీ అయినటువంటి చంద్రికా రవిని తీసుకొచ్చినట్టు కన్ఫర్మ్ అయ్యింది.
పైగా ఆమె కూడా ఈ సాంగ్ షూట్ కోసం సిద్ధం అవుతున్నట్టు ఓ ఫోటో షేర్ చెయ్యగా ఈ సాంగ్ లో ఈమె ఫిక్స్ అని అందరికీ కన్ఫర్మ్ అయ్యింది. ఇంకా ఈ సాంగ్ సహా మిగతా ఆల్బమ్ ని ఎస్ ఎస్ థమన్ సమకూరుస్తుండగా చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.
https://mobile.twitter.com/chandrikaravi_/status/1526603977839677440?s=20&t=iqn9YXpk1UgSPm0_nGjPhw