“NBK 107” నుంచి మాసెస్ట్ పోస్టర్.. ఈ ఒక్క స్టిల్ లో భారీగా పెరిగిపోయిన హైప్.!

ప్రస్తుతం నందమూరి నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా ప్రముఖ హిట్ దర్శకుడు గోపీచంద్ మలినేనితో చేస్తున్న సినిమా NBK 107. ప్రస్తుతానికి ఇలా పిలవబడుతున్న ఈ సినిమా భారీ అంచనాలతో తెరకెక్కుతుంది.

అయితే బాలయ్య అలాగే గోపీచంద్ లు అఖండ మరియు క్రాక్ లాంటి భారీ హిట్స్ తర్వాత చేస్తున్న సినిమా ఇది కావడంతో అనేక అంచనాలు నెలకొన్నాయి. మరి ఇప్పటివరకు 40 శాతం మేర షూటింగ్ చిత్రీకరించుకున్న ఈ చిత్రం నుంచి ఆల్రెడీ బాలయ్య లుక్ ఎలా ఉంటుందో చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్ తో రివీల్ చెయ్యగా..

ఈసారి బాలయ్య కొట్టే దెబ్బ మామూలుగా ఉండదని అందరూ ఫిక్స్ అయ్యిపోయారు. ఇక అదే అనుకుంటే దాన్ని తలదన్నేలా ఇప్పుడు నందమయూరి తారకరామారావు 100వ జయంతి కానుకగా చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు.

మళ్ళీ బాలయ్య లెజెండ్ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ లో ఉండే లుక్ లో కనిపిస్తూ ఓ రేంజ్ మాస్ చూపించాడు. దీనితో ఈ ఒక్క పోస్టర్ తో భారీగా హైప్ నందమూరి అభిమానుల్లో ఈ చిత్రంకి పెరిగిపోయింది. దీనితో అయితే నందమూరి ఫ్యాన్స్ అయితే చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక సినిమా రిలీజ్ టీజర్ లు ట్రైలర్స్ కి ఎలా ఉంటుందో చూడాలి.