Big Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో పాల్గొన్న బోతున్న స్టార్ సెలబ్రిటీస్?

Big Boss 6: బుల్లితెరపై ప్రసారమవుతున్న అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ కార్యక్రమం గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రసారం అవుతూ ప్రేక్షకులను పెద్దఎత్తున సందడి చేస్తోంది.పలు భాషలలో ప్రసారం అవుతూ కొన్ని సీజన్లను పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం తెలుగులో కూడా ఇప్పటికి ఐదు సీజన్లు పూర్తి చేసుకోవడమేకాకుండా ఒక నాన్ స్టాప్ సీజన్ కూడా పూర్తి చేసుకుంది.ఇకపోతే తాజాగా ఈ కార్యక్రమాన్ని తిరిగి బుల్లితెరపై ప్రసారం చేయడానికి నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

బిగ్ బాస్ సీజన్ 6 కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం నిర్వాహకులు ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్లు తెలుస్తోంది.ఇకపోతే ఈ కార్యక్రమంలో పాల్గొన్న బోయే కంటెస్టెంట్ లు ఎవరు అనే విషయం గురించి ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే కొందరి కంటెస్టెంట్ ల పేర్లు పెద్దఎత్తున చక్కర్లు కొడుతున్నాయి.అయితే ఈ సారి బుల్లితెర పై సోషల్ మీడియాలో బాగా క్రేజ్ సంపాదించుకున్న స్టార్ సెలబ్రెటీలు హాజరవుతున్నారని సమాచారం.

బిగ్ బాస్ సీజన్ సిక్స్ కార్యక్రమంలో యూట్యూబర్ హర్ష సాయి, యాంకర్ వర్షిణి, దీపికా పిల్లి, నవ్య స్వామి, ధన్షు, చిత్ర రాయ్ మరియు కమెడియన్ ఆదివంటి వారు పాల్గొనబోతున్నారని తెలుస్తుంది. వీళ్లు మాత్రమే కాకుండా నాన్ స్టాప్ సీజన్ లో పాల్గొన్న కొందరు కంటెస్టెంట్ లు కూడా ఈ కార్యక్రమంలో సందడి చేయనున్నారు. అలాగే ఈ సీజన్ లో ఒక కామన్ మ్యాన్ ఎంట్రీ ఉండబోతుంది. ఎప్పటిలాగే ఈ కార్యక్రమానికి నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.ఇక ఈ కార్యక్రమం సెప్టెంబర్ నెలలో ప్రసారం కానుందని వార్తలు వస్తున్నాయి.