Shiva Reddy: నేను సంపాదించిన 70 లక్షలు వాడుకొని దారుణంగా మోసం చేశారు…. నటుడు శివారెడ్డి కామెంట్స్!

Shiva Reddy:శివారెడ్డి అనగానే మొదట గుర్తొచ్చేది మిమిక్రీ. మిమిక్రీ ఆర్టిస్ట్ గా దేశవిదేశాల్లో ప్రోగ్రాం చేస్తూ మంచి పేరు సంపాదించుకున్నారు. సినిమా నటీనటులు రాజకీయ నాయకుల గొంతుని అలంకరించడంలో శివారెడ్డి దిట్ట. మిమిక్రీలోనే కాకుండా సినిమాల్లో కూడా బాగా రాణించారు. ప్రస్తుతం పెద్దగా సినిమాలు లేవు కానీ ఒకప్పుడు ఒక వైపు సినిమాలు మరో వైపు మిమిక్రీ ఇలా రెండు చేతులు బాగా సంపాదించారు. ఇలా సంపాదించినదంతా సుమారు 70 లక్షలు ఒక ఫ్రెండ్ తనని మోసం చేసి మొత్తం ఊడ్చేచేశాడని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

శివారెడ్డి తనకు జరిగిన మోసం గురించి ఒక ఇంటర్వ్యూలో ఇలా చెప్పుకొచ్చారు….. ఫ్రెండ్స్ అంటే నాకు పిచ్చి ,ఫ్రెండ్స్ కోసం నేను ఏమైనా చేస్తాను. హైదరాబాద్ కి వచ్చిన కొత్తల్లో కొంతమంది నాకు ఫ్రెండ్స్ అయ్యారు ,వారిలో ఒకరు వారి కుటుంబం తనను మోసం చేశారని చెప్పాడు. సంపాదించిన దాంతో ఎవరైనా సరే ఒక ప్రాపర్టీ చేసుకోవాలని చూస్తారు. అలాగే శివారెడ్డి కూడా హైదరాబాదులో ప్రాపర్టీ చేసుకోవాలని ఫ్రెండ్స్ తీసుకొని బాగా తిరిగారాట, ఆ క్రమంలోనే ఏ ప్రాపర్టీ చూసిన అది బాగోలేదు ఇది బాగోలేదు అని తన ఫ్రెండ్ ఏదో ఒక పేరు పెట్టారట.

ఇలాంటి సమయంలో శివారెడ్డికి అమెరికాలో ఒక ప్రోగ్రాం అవకాశం వచ్చిందట, ఆ ప్రోగ్రాం కోసమని అమెరికాలోనే ఒక నెల ఉండాల్సి వచ్చిందట. అలా వెళ్లేటప్పుడు డబ్బులు మొత్తం వాళ్ళింట్లోనే పెట్టారట, తాను తిరిగి వచ్చేసరికి అవసరాలకోసం డబ్బు మొత్తం వాడేశారట. తీరా తిరిగి వచ్చాక ఒక ప్రాపర్టీ విషయమై డబ్బు తీసుకురమ్మని ఫ్రెండ్ అని అడిగాడట, తీరికగా తన ఫ్రెండ్ అప్పుడు చెప్పారట. ఐదారు రోజుల్లో తిరిగి డబ్బు ఇచ్చేస్తానని ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు అని చెప్పుకొచ్చారు. అదే 70 ఉందంటే ఇప్పటికే మణికొండలో రెండు మూడు ఎకరాల అయినా నాకు ఉండేదని చెబుతూ బాధపడ్డారు.