Actor Harsha: కొన్ని సినిమాల్లో తన స్క్రిప్టు వాడుకొని, తన పేరు మాత్రం వేయని సినిమాలు చాలా ఉన్నాయని సినీ నటుడు, డైరెక్టర్ హర్ష వర్థన్ అన్నారు. రైటింగ్‌నే నమ్ముకొని, రైటర్‌గా సెటివ్ అవ్వాలనకునే వారికి మాత్రం చాలా నష్టం అని ఆయన చెప్పుకొచ్చారు. తాను ఒక యాక్టర్‌గా కొంచెం పాపులర్ అయిపోయి ఇలా ఉన్నా గానీ, తాను కూడా రైటింగ్‌నే నమ్ముకొని, దాంట్లోనే పేరు తెచ్చుకోవాలి అంటే మాత్రం వచ్చి ఉండేది కాదేమోనని ఆయన అన్నారు. ఇండస్ట్రీలో తెర వెనకాల ఏం చేసినా అది హీరోకే వెళ్లిపోతుందన్న ఆయన, ఈ మధ్య కాలంలో కొంచెం తెర ముందుకు వస్తున్నారు వాళ్లు కూడా అని ఆయన తెలిపారు. ఇంతకు ముందు అయితే అసలు డైరెక్టర్ ఏం చేస్తాడో కూడా చాలా మందికి తెలియకపోయేదని ఆయన అన్నారు. అందులో రైటర్‌కి దక్కేది చాలా తక్కువ అని ఆయన వాపోయారు.
ఇకపోతే మనం సినిమాకు డైలాగ్స్ రాసేందుకు చాలా మందిని ట్రై చేసినా కూడా అవి నాగార్జున గారికి నచ్చకపోవడంతో చాలా మందిని రిజెక్ట్ చేశారని హర్ష తెలిపారు. ఆ తర్వాత అది ఫైనల్‌గా ఆ ప్రాజెక్టు తన వద్దకు వచ్చిందని, అప్పటికీ గుండె జారి గల్లంతయ్యిందే సినిమా రిలీజ్ కాలేదని ఆయన చెప్పారు. కానీ తనకు అప్పటికి అంత పాపులారిటీ లేకపోవడం కేవలం 3 సీన్లు మాత్రమే రాసేందుకు అవకాశమిచ్చారని ఆయన తెలిపారు. అయితే ఎలాంటి సీన్లు రాయాలి అని ఆలోచించే సందర్భంలో లెన్త్ ఎక్కువైందని ఎడిటింగ్లో తీసేస్తారు కదా అలాంటి సీన్లు తాను రాస్తానన్నారని, ఎందుకంటే సినిమా అనేది ఒక ఎమోషన్ అని, సినిమాను మొదట్నుంచి కాకుండా మధ్యలో 3 సీన్లు రాయమంటే ఏం రాయాలి అని తాను అడిగినట్టు ఆయన చెప్పారు. వాళ్లకు తన ఐడియా నచ్చడంతో రాయమని అవకాశం ఇవ్వడంతో, ఆ తర్వాత అనుకున్న దానికంటే ముందే నాగార్జున గారికి చూపించడం, అది ఆయనకు చాలా నచ్చడం జరిగిపోయానని ఆయన అన్నారు. సర్ ఇంకెప్పుడూ అలా చేయకండి, మీకు నేను రాసిన సీన్లు నచ్చాయి కాబట్టి పర్లేదు. కానీ నచ్చకపోయి ఉంటే ఎలా అని తాను నాగార్జున గారితో అన్నానని హర్ష తెలిపారు. ఇక ఆ రోజు నుంచి ఏ సీన్ విన్నా కూడా తన గురించి ప్రతీ స్టేజ్ మీద మాట్లాడతారని ఆయన చెప్పారు.
అలాగే హీరో నితిన్ కూడా తనను నమ్మి, అవకాశం ఇచ్చారని హర్ష వర్థన్ అన్నారు. తను స్ర్కిప్ట్ రాసిన తర్వాత చెప్తాను గానీ, ముందే ఆ ఫ్లోలో చెప్పేంత తనకు ఉండదని ఆయన అన్నారు. తన మైండ్‌లో చాలా తొందరగా ఐడియాలు మారిపోతాయని ఆయన చెప్పారు. తనకు గనక స్క్రిప్ట్ ఇచ్చి వెంటనే షూటింగ్ చేస్తే ఓకే గానీ, గ్యాప్ ఇస్తే మాత్రం మొత్తం మారుపోతుందని ఆయన చెప్పారు. అలా గుండె జారి గల్లంతయ్యిందే సినిమాకి తాను స్క్రిప్టు మొత్తం మార్చేసి రాయడం, అదీ నితిన్ నమ్మి ఓకే చేయడం అనేది చాలా గొప్ప విషయమని ఆయన వివరించారు.