పంచ్ ప్రసాద్ ఆపరేషన్ కి వారు ఒక్క రూపాయి కూడా సహాయం చేయలేదు.. అంత వారే పెట్టుకున్నారు?

జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని ప్రస్తుతం ఆ కార్యక్రమం నుంచి బయటకు రావడమే కాకుండా మల్లెమాల వారిపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు కమెడియన్ కిరాక్ ఆర్పి.ఎక్కడో హోటల్లో సర్వెంట్ గా పనిచేస్తున్న ఇతనికి జబర్దస్త్ కార్యక్రమం ఒక మంచి అవకాశంగా మారింది. ఇలా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా గుర్తింపు పొందిన ఆర్పి నాగబాబుతో పాటు ఆ కార్యక్రమం నుంచి బయటకు వచ్చి ప్రస్తుతం కామెడీ స్టార్స్ కార్యక్రమంలో సందడి చేస్తున్నారు.

ఇకపోతే తాజాగా ఈయన ఓ కార్యక్రమంలో భాగంగా మల్లెమాల వారిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. జబర్దస్త్ కార్యక్రమం నుంచి మల్లెమాలవారు కోట్లు సంపాదిస్తున్న ఈ కార్యక్రమంలో సందడి చేస్తే కమిడియన్లకు సరైన భోజనం వసతి ఏర్పాట్లు కూడా లేవని మండిపడ్డారు.ఈ క్రమంలోనే పంచ్ ప్రసాద్ ఆరోగ్య విషయాని గురించి కూడా ఈయన మాట్లాడుతూ మల్లెమాల వారిపై ఆరోపణలు చేశారు. పంచ్ ప్రసాద్ కిడ్నీ సమస్యలతో బాధపడిన సంగతి మనకు తెలిసిందే.

ఒకానొక సమయంలో ఈయన ఆరోగ్య పరిస్థితి ఎంతో విషమంగా మారింది. కిడ్నీలు సరిగా లేకపోవడంతో డయాలసిస్ చేయాలని వైద్యులు సూచించారు అయితే చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో ఈ విషయాన్ని మల్లెమాల వారి దృష్టికి తీసుకెళ్లిన పెద్దగా పట్టించుకోలేదు. ఆ సమయంలో నాగబాబు అందరిని సమావేశపరిచి అందరూ డబ్బు పోగుచేసే అతనికి డయాలసిస్ చేశామని అయితే అతని ఆరోగ్యం కాస్త కుదుటపడిన తర్వాత సాంప్రసాద్ రెడ్డి గారు ఎలా ఉంది ప్రసాద్ అంటూ తనని పరామర్శించారని ఆర్పిఈ సందర్భంగా మరోసారి మల్లెమాల వారిపై ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది.