ఫ్రెండే కదా అని నమ్మితే చివరకు అవకాశాలు లేకుండా చేస్తారు:మధునందన్

ఇండస్ట్రీలో మదునందన్ పేరు గురించి పెద్దగా తెలియనప్పటికీ..గుండెజారి గల్లంతయ్యిందే సినిమాలో నితిన్ ఫ్రెండ్ మధు అంటే మాత్రం అందరూ గుర్తు పడతారు. అలా ఎన్నో సినిమాలలో ప్రధాన పాత్రలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న నటుడు మదునందన్. తేజ దర్శకత్వం వహించిన “నువ్వు నేను” సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయిన మధునందన్ ఎన్నో సినిమాలలో నటించాడు. రాజమౌళి దర్శకత్వంలో నితిన్ హీరోగా వచ్చిన” సై ” సినిమాలో హీరో ఫ్రెండ్ పాత్రలో నటించి మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. తర్వాత కొంతకాలం ఇండస్ట్రీకి దూరంగా ఉన్న మదునందన్ నితిన్ హీరోగా నటించిన “గుండెజారి గల్లంతయ్యిందే” సినిమా ద్వారా ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చాడు.

ఈ సినిమాలో నితిన్ ఫ్రెండ్ పాత్రలో నటించాడు. ఈ సినిమా ద్వారా మధునందన్ పాపులారిటీ మరింత పెరిగింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మధునంధన్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సినిమా విశేషాలతో పాటు తన లైఫ్ కి సంబందించిన ఎన్నో విషయాలు కూడా పంచుకున్నాడు. సినిమా ఇండస్ట్రీలో ఉన్న వారితో పరిచయాలు ఉంటేనే ఇండస్ట్రీలో అవకాశాలు వస్తాయి…లేదంటే అవకాశాల కోసం చాలా కష్టపడాల్సి వస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు. తనకి ఇండస్ట్రీకి చెందిన వారితో పరిచయాలు లేకపోవటం వల్ల నేను అవకాశాల కోసం చాలా కష్టపడ్డాను అంటూ చెప్పుకొచ్చాడు.

సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరినీ నమ్మటానికి లేదు. ఎందుకంటే ఫ్రెండ్ లాగా పక్కన ఉంటునే మనల్ని మోసం చేసేవారు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. ఒకవేళ మన ఫ్రెండే కదా అని నమ్మి మనకి వచ్చిన అవకాశాల గురించి చెబితే.. ఆ సినిమా వాళ్ళ దగ్గరకు వెళ్లి ఆ అవకాశం మనకు రాకుండా చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అంటూ చెప్పుకొచ్చాడు. ఇలా చేయటం కూడ ఒక కళ అని అనుకోవాలి అంటూ చెప్పుకొచాడు. ఇక తన సినిమా విశేషాల గురించి చెబుతూ..ఎప్పుడు ఓకే రకమైన పాత్రలు చేయటం నాకు ఇష్టం లేదు. ఖాళీగా ఉండలేక ఏదో ఒకటి అంటూ చేసుకుంటూ పోతే .. కెరీర్ లో పైకి ఎడగలేము. అందువల్ల నెమ్మదిగా అయిన నటనకి ప్రాధాన్యత ఉన్న మంచి పాత్రలు చేయాలనుకుంటున్నా అంటూ చెప్పుకొచ్చాడు.