Jyothi: ఒక డ్రగ్స్ కేసును కప్పి పుచ్చడానికి మిగతా కేసులను లేవనెత్తి తనను ట్రాప్ చేశారని నటి జ్యోతి అన్నారు. ఇంట్లో ఉన్నదాన్ని తనను తీసుకెళ్లి ట్రాప్ చేయడం నిజంగా దారుణమని, కానీ తనకు అన్యాయం చేసిన వారు కచ్చితంగా అనుభవిస్తారని, ప్రస్తుతం అది చూస్తున్నాను కూడా అని ఆమె చెప్పుకొచ్చారు. ఇలా చాలా సంఘటనలు చూస్తున్నానని, అవి తన చెవిన పడ్డప్పుడు కలిగే ఆనందమే వేరు అని ఆమె అన్నారు. ఎవరైతే ట్రాప్ చేశారో వాళ్ల వైఫ్ చనిపోవడం, మదర్ చనిపోవడం జరిగాయని ఆమె తెలిపారు. అప్పుడే తాను డైవర్స్ తీసుకొని వచ్చానని ఆమె అన్నారు.
తాను ఆ సమయంలో చాలా డిఫ్రెషన్‌లోకి వెళ్లానని, ఎందుకంటే చెయ్యని దానికి అంత బ్లేమ్ తీసుకొని ప్రతీ క్షణం తనను అది వెంటాడుతూ ఉండేదని ఆమె చెప్పారు. ఒక సంవత్సరం వరకూ కూడా వేరే లోకంలోకి వెళ్లానని, ఆ సమయంలో తన తండ్రి వెంటే ఉన్నారని ఆమె తెలిపారు. ఆ సమయంలో అసలు ఏం చేయాలి, ఎవరిని కలవాలనేది తనకు తెలియదని, దానికి తోడు తన బాబు అప్పుడు చిన్నగా ఉన్నాడని ఆమె చెప్పారు. అంత చిన్న బాబుని తీసుకొని తాను ఎలా ఫైట్ చేయగలనని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాను డిఫ్రెషన్ నుంచి బయటికొచ్చాక ఒకటే అనుకున్నానని, మనం రియాక్ట్ అయితే హర్ట్ అవుతాం.. రియాక్ట్ అవకపోతే దాని గురించి బాధపడం అని, అలా తనను తాను స్ట్రాంగ్‌గా చేసుకున్నా అని ఆమె స్పష్టం చేశారు.
తాను అంత ఇబ్బందుల్లో ఉన్నపుడు, అంత డిఫ్రెషన్‌కు గురైనపుడు సినీ ఇండస్ట్రీ నుంచి తనకు ఎలాంటి ఓదార్పూ లభించలేదని జ్యోతి అన్నారు. ఎందుకంటే వారంతా సిచ్యువేషన్‌కు ఒక వైపు మాత్రమే చూశారని, మరో సైడ్ చూల్లేదని ఆమె చెప్పారు. ఇక తనముందున్న లక్ష్యం ఏంటంటే తన బాబును చూసుకోవడమేనని ఆమె స్పష్టం చేశారు. మిగతావన్నీ కూడా బుల్ షిట్ అని ఆమె సమాధానమిచ్చారు.