టాలీవుడ్ లో వాయిదా పడిపోయిన ఈ మూడు ప్రముఖ భారీ చిత్రాలు..!

ఈ ఏడాది మన టాలీవుడ్ నుంచి పలు భారీ సినిమాలు వచ్చి వచ్చి ఆల్ మోస్ట్ అన్నీ సక్సెస్ అయ్యాయి. అలాగే వాటిలో ప్లాప్ అయితే అయితే మళ్ళీ కను చూపు మేరలో కూడా కనిపించని రేంజ్ డిజాస్టర్స్ గా కొన్ని చిత్రాలు నిలిచిపోయాయి.

కానీ వాటిని మించి కొన్ని సినిమాలు అయితే సెన్సేషనల్ హిట్ కాగా రానున్న రోజుల్లో మరికొన్ని భారీ సినిమాలు రిలీజ్ కి సిద్ధం అయ్యాయి. ఆల్ మోస్ట్ అయితే ఈ ఆగష్టు లోనే కొన్ని క్రేజీ అవైటెడ్ సినిమాలు రిలీజ్ కావాల్సి ఉన్నాయి. మరి ఆ చిత్రాల్లో మూడు సినిమాలు అయితే వాయిదా పడిపోయినట్టుగా సినీ వర్గాల్లో టాక్ ఒకటి వినిపిస్తుంది.

ఆ సినిమాలు ఒకటి అఖిల్ అక్కినేని నటిస్తున్న భారీ చిత్రం “ఏజెంట్” కాగా మరో రెండు చిత్రాలు రీసెంట్ గా మేజర్ తో సూపర్ సక్సెస్ అందుకున్న హీరో అడివి శేష్ నటించిన ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ “హిట్ పార్ట్ 2” అలాగే మరో పాన్ ఇండియా చిత్రం స్టార్ హీరోయిన్ సమంత నటించిన “యశోద” చిత్రాలు అని తెలుస్తుంది.

నిజానికి ఈ మూడు సినిమాలు కూడా ఎప్పుడో ఆగస్ట్ రిలీజ్ కి అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు ఫైనల్ గా అయితే ఈ రేస్ నుంచి ఈ చిత్రాలు తప్పుకుంటున్నట్టు తెలుస్తుంది. మరి వీటిపై అయితే మళ్ళీ కొత్త డేట్స్ ఎప్పుడు వస్తాయో కూడా చూడాలి.