1000 కోట్ల కంటే ఎక్కువ కలెక్షన్లు సాధించే స్టామినా ఉన్న స్టార్ హీరోల సినిమాలివే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్నేళ్ల క్రితం వరకు 100 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు సాధించడం చాలామంది హీరోలకు సాధ్యమయ్యేది కాదు. అయితే ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలు ఫ్లాప్ టాక్ తో సైతం సులువుగా 100 కోట్ల షేర్ కలెక్షన్లను సాధిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. సినిమాకు హిట్ టాక్ వస్తే మాత్రం 1,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువగా గ్రాస్ కలెక్షన్లు వచ్చినా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

వరుసగా సౌత్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తుండటం గమనార్హం. అయితే రాబోయే రెండేళ్లలో బాక్సాఫీస్ వద్ద 1000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ కలెక్షన్లను సాధించే సత్తా ఉన్న స్టార్ హీరోల సినిమాలు ఎక్కువగానే ఉన్నాయి. ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలు బాక్సాఫీస్ వద్ద 1000 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించే అవకాశాలు అయితే ఉన్నాయి.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్ లో ఒక సినిమాలో, ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తుండగా ఈ రెండు సినిమాలు కూడా 1,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువగా గ్రాస్ కలెక్షన్లను సాధించే అవకాశాలు అయితే ఉన్నాయని తెలుస్తోంది. చరణ్ శంకర్ కాంబో మూవీ, చరణ్ సుకుమార్ కాంబో మూవీ కూడా 1000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం కలెక్షన్లను సాధించే ఛాన్స్ అయితే ఉంది.

అల్లు అర్జున్ నటించబోతున్న పుష్ప ది రూల్ సినిమా కూడా 1000 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాతో 1000 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకునే ఛాన్స్ అయితే ఉందని తెలుస్తోంది. మహేష్ బాబు జక్కన్న సినిమాతో 1000 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది.