Vastu Tips: ఇంట్లో ఆర్థిక సమస్యలను ముందుగానే సూచించే లక్షణాలు ఇవే..!

Vastu Tips: సాధారణంగా ప్రతి ఒక్కరూ వారి ఇంట్లో ఎన్నో రకాల ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు. అయితే కొన్నిసార్లు మనం ఎంత డబ్బులు సంపాదించిన చేతిలో నిలబడదు. ఇలా కొన్ని సార్లు ఎన్నో ఆర్థిక సమస్యలు మనల్ని వెంటాడుతాయి. అయితే మన ఇంట్లో ఆర్థిక సమస్యలను ముందుగానే కొన్ని లక్షణాలు మనకు కనిపిస్తాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. వాస్తు శాస్త్రం ప్రకారం మన ఇంట్లో కనుక ఈ లక్షణాలు కనబడితే మన ఇంట్లో ఆర్థిక సమస్యలు వెంటాడతాయి అని అర్థం. మరి లక్షణాలు ఏమిటి అనే విషయానికి వస్తే…

చాలామంది ఇళ్లలో దీపారాధన చేయకుండా ఉంటారు. అలాంటి వారి ఇంటి పై ఎల్లప్పుడూ ప్రతికూల ప్రభావం పడుతుంది. ఇలాంటి ప్రతికూల ప్రభావం ఉన్న వారి ఇంట్లో ఎన్నో సమస్యలు మనస్పర్థలు తలెత్తాయి. ఇలాంటి ఇంట్లో లక్ష్మీదేవి కూడా కొలువై ఉండదు. అదేవిధంగా ఎప్పుడు ఇంట్లో గొడవలు ఘర్షణలు పడుతూ ఉండడం. ఇలా గొడవలు పడుతున్నా ఇంటిలో లక్ష్మీదేవి కొలువై ఉండదు.అలాగే ఏ ఇంటిలో అయితే పెద్దవారిని అవమానపరిచే గౌరవిస్తారు అలాంటి వారి ఇంటిలో కూడా లక్ష్మీదేవి కొలువై ఉన్న ఉండదు ఈ లక్షణాలన్నీ కూడా మన ఇంట్లో ఆర్థిక సమస్యలు వస్తాయని చెప్పడానికి సంకేతం.

అలాగే మన ఇంట్లో లక్ష్మీ స్వరూపంగా భావించి ప్రతి రోజు పూజలు చేసే తులసి చెట్టు విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. ఎప్పుడైతే తులసిచెట్టు ఉన్నఫలంగా వాడిపోతుందో అప్పుడు మన ఇంట్లో ఆర్థిక సమస్యలు వెంటాడతాయనే దానికి సంకేతం. కనుక తులసి చెట్టు విషయంలో కూడా ఎంతో జాగ్రత్త తప్పనిసరి. ఇక చాలామంది ఇంటిలో పగిలిపోయిన వస్తువులను పెట్టుకుంటారు. అలాగే కొందరి ఇళ్ళల్లో తరచుగా వస్తూ పోతూ ఉంటాయి. ఇలా గాజు వస్తువులు పగిలిపోవడం కూడా ఆర్థిక సమస్యలను సూచిస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది.