సాయి పల్లవి పొట్టి బట్టలు వేసుకోకపోవటం వెనక ఇంత పెద్ద కారణం ఉందా..?

నాచురల్ బ్యూటీ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఫిదా సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన సాయి పల్లవి ఆ సినిమాలో తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వటంతో తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషలలో వరుసగా స్టార్ హీరోల సరసన నటించే అవకాశం దక్కించుకుంది. సాయి పల్లవి ఇండస్ట్రీలో వచ్చిన నాటి నుండి ఇప్పటివరకు గ్లామర్ పాత్రలకి దూరంగా ఉంటూ నటనకి ప్రాధాన్యత ఉన్న పాత్రలని మాత్రమే చేస్తూ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది.

ప్రస్తుతం సాయి పల్లవి తెలుగులో హీరో రానా సరసన విరాటపర్వం సినిమాలో నటించింది. నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకి వేణు ఊడుగుల దర్శకత్వం వహించారు. ఈ సినిమ షూటింగ్ పనులు పూర్తి చేసుకొని ఈ నెల 17 వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో సినిమా యూనిట్ ప్రమోషన్స్ ని వేగవంతం చేసింది. ఈ క్రమంలో లో రానా సాయి పల్లవి పలు టీవీ షోలకు హాజరవుతూ ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమా ప్రమోషన్స్ లో చాలా బిజీగా ఉన్నారు. తాజాగా సాయి పల్లవి ఓపెన్ హార్ట్ విత్ ఆర్ కె అనే షో లో పాల్గొని సినిమా విషయాలతో పాటు తన పర్సనల్ విషయాలు గురించి కూడా చెప్పుకొచ్చింది.

ఈ సందర్భంగా పొట్టి వేసుకోకపోవటం వెనుక గల కారణం ఏంటి అడగగా.. సాయి పల్లవి వివరణ ఇచ్చింది. సాయి పల్లవి ఒక మంచి డాన్సర్. జార్జియాలో మెడిసిన్ చేసే సమయంలో సాయి పల్లవి టాంగో డాన్స్ కూడా నేర్చుకొని పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఈ డాన్స్ చేయటానికి సాయి పల్లవి కొంచం కురచగా ఉన్న దుస్తులు ధరించింది. ఈ డాన్స్ వీడియో చూసిన వారు రకరకాలుగా కామెంట్స్ చేయటంతో సాయి పల్లవి బాగా హర్ట్ అయ్యింది. అందువల్ల సినిమాలలో అడుగుపెట్టినప్పటి నుండి ఆసలు ఇలాంటి పొట్టి బట్టలు వేసుకోకూడదు అని నిర్ణయించుకుంది. ఒకవేళ ఆమె తీసుకున్న నిర్ణయం వల్ల సినిమా అవకాశాలు రాకపోయినా కూడ డాక్టర్ గా తన పని తాను చేసుకుపోతాను అంటూ చాలా కాన్ఫిడెంట్ గా చెప్పుకొచ్చింది.