Kalyan: థియేటర్ విషయంలో దిల్ రాజు, అల్లు అరవింద్‌ల తప్పేమీ లేదు.. నిర్మాత కళ్యాణ్ షాకింగ్ కామెంట్స్!

Kalyan: దిల్ రాజు, అల్లు అరవింద్‌లు సినిమాకు ద్రోహం చేస్తున్నారు అంటున్నారు గానీ.. దాంట్లో వాళ్ల తప్పేమీ లేదని కళ్యాణ్ అన్నారు. ఎవరి బిజినెస్ వారిది, ఎవరి డిస్టిబ్యూషన్ వారిదని ఆయన చెప్పుకొచ్చారు. ఆ విషయానికి తాను కూడా వాళ్ల కంటే తక్కువేమీ కాదని, కానీ తనను మాత్రం అలా అనట్లేదని ఆయన చెప్పారు. ఎందుకంటే వాళ్లందరికీ తాను ద్రోహం చేస్తున్నట్లు అనిపించలేదని ఆయన అన్నారు.

ఇకపోతే దిల్ రాజు గానీ, అల్లు అరవింద్ గానీ.. ఇంకెవరైనా గానీ థియేటర్లు లీజుకి తీసుకోవడం అనేది వాళ్ల వ్యాపారంలో భాగమేనని ఆయన అన్నారు. ఎవరి పని వాళ్లు చేస్తున్నారు. అలాగే వాళ్లు కూడా వాళ్ల బిజినెస్ చేసుకుంటున్నారే గానీ, దాంట్లో తప్పేముందని ఆయన చెప్పారు. కాబట్టి వాళ్లు ద్రోహం చేస్తున్నారు అంటే కూడా తాను ఒప్పుకోనని ఆయన స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా తన లైఫ్‌లో అత్యంత పెయిన్‌ఫుల్ సందర్భం అంటే తాన భార్య ఆత్మహత్య చేసుకోవడమేనని ఆయన అన్నారు. ఆ సమయంలో షూటింగ్‌లోనే ఉన్నామని, తన భార్య చనిపోయినట్టు తన తమ్ముడికి, తనకు మాత్రమే తెలుసని ఆయన చెప్పారు. అక్కడ షూటింగ్ పూర్తయ్యాక గానీ ఆ విషయాన్ని రివీల్ చేయలేదని ఆయన తెలిపారు. ఆ టైంలో డబ్బులు లేకపోతే బ్రహ్మానందం గారే డబ్బులిచ్చి మరీ ఫ్లైట్‌కి వెళ్లేలా చేశారని ఆయన వివరించారు.