వెండితెరపై ఒకానొక సమయంలో అగ్రతారగా కొనసాగిన గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత దశాబ్ద కాలం క్రితం ఈమె క్రేజ్ చూసి ఎంతో మంది దర్శక నిర్మాతలు సైతం ముక్కున వేలేసుకున్నారు. ఇలా వెండితెరపై ఎంతో అద్భుతమైన గుర్తింపు సంపాదించుకున్న ఇలియానా తెలుగు తమిళ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉండిపోయారు. ఈ క్రమంలోనే ఇలియానా విదేశీ వ్యక్తితో ప్రేమలో పడి ప్రేమలో మునిగి తేలుతూ తన కెరీర్ ను నిర్లక్ష్యం చేసింది. ఇలా కెరీర్ నిర్లక్ష్యం చేయడంతో ఈమెకు వరుస ఫ్లాప్ చిత్రాలు ఎదురయ్యాయి.ఇలా దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అవకాశాలు రాకపోవడంతో ఈ గోవా బ్యూటీ బాలీవుడ్ వైపు పయనమయ్యారు.
బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా తనకు అవకాశాలు వచ్చినప్పటికీ పెద్దగా గుర్తింపు మాత్రం రాలేదు అని చెప్పాలి.దీంతో తిరిగి సౌత్ ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మకు ఇక్కడ మాత్రం అవకాశాలు లభించలేదనే చెప్పాలి అవకాశాలు లేకపోవడంతో అవకాశాల కోసం ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా వేదికగా చేసుకొని తన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను సంపాదించుకుంది. ఈ విధంగా వరుస ఫోటో షూట్ లతో బోల్డ్ ఫోటోలకు ఫోజులు ఇస్తూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
ఇలా ఇలియానా అందాలన్నిటినీ ఆరబోస్తూ సోషల్ మీడియా వేదికగా చేసే రచ్చ మాములుగా లేదని చెప్పాలి. బికినీతో ఫోటోలకు ఫోజులివ్వడం జిమ్ చేస్తూ చెమటలు కక్కుతూ ఉన్నటువంటి ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. అయితే ఈ విధంగా ఇలియానా అందాల ఆరబోతకు కారణం అవకాశాలే అని చెప్పాలి. అవకాశాలు లేక ముద్దుగుమ్మ సోషల్ మీడియా వేదికగా తన ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారు లకు పిచ్చెక్కిస్తున్నారు.ఈ క్రమంలోనే ఇలియానా షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.