యష్ నెక్స్ట్ సినిమా పై క్లారిటీ వచ్చేసింది

కన్నడ సినిమా అంటే ఒకప్పుడు కర్ణాటక లో తప్ప బయట ఇండస్ట్రీ లో అంతగా తెలిసేది కాదు. ఇంక కన్నడ నటులు కూడా పెద్దగా ఎవరికీ ఐడియా కూడా ఉండేది కాదు. 1990s లో ఉపేంద్ర మాత్రం తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ ని సృష్టించుకున్నాడు, కానీ ఆ తర్వాత కన్నడ ఇండస్ట్రీ నుండి అప్పుడప్పుడు సుదీప్ తప్ప మిగతా హీరోలు ఎవ్వరూ తెలుగు లో మార్కెట్ ని విస్తరించలేదు.

కానీ ఒక్కసారి గా ‘కెజిఫ్’ సినిమాతో మొత్తం ఇండియన్ సినిమా కన్నడ సినిమా వైపు చూడడం మొదలుపెట్టింది. ఆ సినిమాలో నటించిన యష్ ఒక్కసారిగా పాన్ ఇండియా హీరో అయిపోయాడు.

కెజిఫ్ రెండు పార్ట్ లు సూపర్ హిట్ అవ్వడంతో యష్ తన నెక్స్ట్ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఎటువంటి తొందరపాటు నిర్ణయం తీసుకోకుండా యష్ కొంత టైం తీసుకుని కొత్త సినిమా సైన్ చేసినట్టు తెలుస్తుంది.

తాజా సమాచారం ప్రకారం ‘మఫ్టీ’ ఫెమ్ డైరెక్టర్ నార్తన్ దర్శకత్వంలో చేస్తున్నాడు.ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులను స్టార్ట్ చేసిన చిత్ర బృందం త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులను ప్రారంభిస్తున్నట్లు తెలుస్తోంది.

‘కెజిఫ్’ లాగే ఈ సినిమా కూడా పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా పూజ హెగ్డే నటించే ఛాన్స్ ఉందని తెలుస్తుంది.